అమరావతి : ఈ ఎంపీల్లో టెన్షన్ మొదలైందా ?

Vijaya






వేలకోట్ల రూపాయల ప్రజాధానాన్ని బ్యాంకుల అప్పుల పేరుతో దోచుకున్న ఎంపీలు, మాజీ ఎంపీల్లో టెన్షన్ మొదలైనట్లే ఉంది. ఎందుకంటే ఇదే విధమైన ఒక కేసులో ఒక మాజీ ఎంపీకి సీబీఐ కోర్టు ఐదేళ్ళు జైలుశిక్ష విధించింది కాబట్టే. ఇంతకీ విషయం ఏమిటంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి రు. 42 కోట్లు అప్పుగా తీసుకున్నారు వైసీపీ  మాజీ ఎంపీ కొత్తపల్లి గీత. వైసీపీ ఎంపీగా 2014లో గెలిచిన గీత వెంటనే టీడీపీలోకి ఫిరాయించేశారు.



2019 ఎన్నికల సమయంలో టీడీపీలో నుండి బీజేపీలోకి వెళ్ళిన గీత ప్రస్తుతం ఏ పార్టీలో కూడా యాక్టివ్ గా కనబడటంలేదు. అప్పుడెప్పుడో తీసుకున్న బ్యాంకు అప్పు తీర్చనందుకు సీబీఐ ఈమెపై చార్జిషీటు కూడా దాఖలుచేసింది. విచారణ కూడా పూర్తయిపోయింది. తీసుకున్న అప్పు ఎగ్గొటినందుకు  ఈరోజు అంటే బుధవారం నాంపల్లిలోని సీబీఐ కోర్టు గీతకు ఐదేళ్ళ జైలుశిక్ష విధించింది.




ఇక్కడ విషయం ఏమిటంటే గీత తరహాలోనే బ్యాంకుల్లో అప్పులు తీసుకుని ఎగొట్టిన ఎంపీలు ఇంకా ఉన్నారు. వాళ్ళంతా టీడీపీలో ఉన్నపుడు బ్యాంకుల నుండి ఒక్కొక్కళ్ళు వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని ఎగొట్టారు. వైసీపీలో కూడా ఇదే తరహాలో బ్యాంకుల నుండి ప్రజాధనాన్ని దోచేసుకున్నారు. గీత తీసుకుని తీర్చకుండా ఎగొట్టిన అప్పు కేవలం రు. 42 కోట్లు మాత్రమే. అదే టీడీపీ నుండి బీజేపీలోకి ఫిరాయించిన ఎంపీల్లో వేలకోట్లరూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల నుండి ఎగొట్టిన వారున్నారు.



అలాగే వైసీపీ ఎంపీ కూడా వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని ఎగొట్టారు. వీళ్ళందరిమీద సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులు దాడులు చేసి కేసులు కూడా నమోదుచేశారు. వీరిలో కొందరిపై సీబీఐ పెట్టినే అప్పు ఎగవేత కేసులు నిరూపణకూడా అయ్యాయి. అయితే వీరంతా బీజేపీ పార్టీలోనో లేదా బీజేపీతో అంటకాగుతున్నందు వల్లో దర్యాప్తు సంస్ధలు వీళ్ళజోలికి వెళ్ళటంలేదనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఒకసారి వీళ్ళపై దర్యాప్తు సంస్ధలు గట్టిగా వ్యవహరించినా, కోర్టు సీరియస్ అయినా వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు జైలుశిక్ష పడుతుందో. 7

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: