చంద్రబాబు భారీ ప్లాన్... ఓట్లు పడతాయా ?

VAMSI
ఏపీలో 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో అపారమైన రాజకీయ అనుభవం ఉన్న మరియు అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్న టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అనూహ్యంగా కొత్తగా పార్టీ పెట్టిన ఒక యువ నాయకుడు చేతిలో చిత్తు చిత్తు గా ఓడిపోయి డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి. దీనితో వైసీపీ అధికారంలోకి వచ్చి పాలన కొనసాగిస్తోంది. వైసీపీ పాలన సాగించిన ఈ మూడున్నరేళ్లు టీడీపీ చాలా బలహీనపడింది. అంతే కాకుండా జగన్ కూడా ఎక్కడికక్కడ టీడీపీకి పుంజుకునే అవకాశం లేకుండా అడ్డుకట్ట వేస్తున్నాడు. కానీ చంద్రబాబు మాత్రం పట్టు వదలకుండా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు సాధించాలని ఎదురుచూస్తున్నాడు.
ఇక 2024 ఎన్నికలకు ఒకటిన్నర సంవత్సర మాత్రమే ఉంది. దొరికిన ఈ కొద్ది సమయాన్ని వాడుకుని టీడీపీ ని ప్రజలకు మరింత దగ్గర చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఒక చక్కని ప్రణాళికలు శ్రీకారం చుడుతున్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా అన్న క్యాంటీన్ లు నిర్వహించేవారు. వీటి వలన కటిక పేదరికంలో ఉన్నవారు... అనాధలు 5 రూపాయలకే భోజనం తింటూ ఆనందంగా ఉండేవారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక వివిధ కారణాలతో పేదలకు మేలు చేకూరే అన్న క్యాంటీన్ లను కూల్చేశారు. ఇటీవల చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉండగా అక్కడ కూడా తన కళ్ళ ముందు అన్న క్యాంటీన్ లను వైసీపీ నాయకులు కూల్చడం జరిగింది.
అందుకే మళ్లీ చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ లను అనధికారికంగా నెలకొల్పడానికి పూనుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల టీడీపీ నాయకులు తమ సొంత  ఖర్చులతో అన్న క్యాంటీన్ లను నిర్వహిస్తున్నారు. అయితే ఇకపై ఇంతకు ముందు లాగా ఎక్కువ సంఖ్యలో అన్న క్యాంటీన్ లో అందుబాటులో ఉండేలా చేస్తున్నారు. ఇందుకు టీడీపీ నాయకులు పార్టీ తరపున కొంత అమౌంట్, లేదా వారి సొంతంగా అయినా చేయొచ్చని చంద్రబాబు చెబుతున్నారు.  పేదలకు ఎంతో ఉపయోగపడే ఇది కనుక సక్సెస్ అయితే 2024 ఎన్నికల్లో బాగా ఉపయోగపడుతుంది అని టీడీపీ అభిప్రాయం. మరి అపర చాణక్యుడి ప్లాన్ ఫలిస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: