హైదరాబాద్ : కోమటిరెడ్డి బ్రదర్స్ కు పెద్ద షాకేనా ?

Vijaya






మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకేసారి కోమటిరెడ్డి బ్రదర్స్ కు పెద్ద షాకే ఇచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రచారానికి వచ్చిన బీజేపీ నేత, కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అన్నీవిధాలుగా ఆదరించిన పార్టీని వెన్నుపోటు పొడిచి బీజేపీలో చేరాల్సిన అవసరం ఏమొచ్చిందంటు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ ఎంఎల్ఏ వాళ్ళకి ఏదో చెప్పాలని ప్రయత్నించినా కార్యకర్తలు పట్టించుకోలేదు. దాంతో చేసేదిలేక రాజగోపాలరెడ్డి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు.




ఇక సోదరుడు, సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తగిలిన షాక్ ఇంకో విధంగా ఉంది. ఎంపీ సంగతి ఏమిటంటే తమను తమ్ముడు, బీజేపీ అభ్యర్ధి అయిన రాజగోపాలరెడ్డికి మద్దతుగా పనిచేయాలని వెంకటరెడ్డి బాగా ఒత్తిడి పెడుతున్నట్లు మండిపోయారు. మునుగోడు నియోజకవర్గంలోని చాలామంది కాంగ్రెస్ ద్వితీయశ్రేణి నేతలు మీటింగ్ పెట్టుకుని ఎంపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.



బీజేపీ తరపున పోటీచేయబోయే తన తమ్ముడి గెలుపుకోసమే ఎంపీ మమ్మల్ని ఒత్తిడి పెడుతున్నారని బాహాటంగానే చెప్పారు. కాంగ్రెస్ లోనే ఉంటు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారనే అర్ధం వచ్చేట్లుగా నేతలంతా ఎంపీపై మండిపోయారు. దాంతో మొదటినుండి అందరు ఊహిస్తున్నట్లుగానే ఎంపీ బండారం బయటపడింది. తమ్ముడి విజయానికే ఎంపీ పనిచేస్తున్నారనే విషయమై మొదటినుండి పార్టీలో అందరికీ అనుమానాలున్నాయి. కాకపోతే ఆ విషయాన్ని ఎంపీ అంగీకరించటంలేదు. ఇదే సమయంలో ఏవేవో అంశాలను లేవనెత్తి పార్టీలో కంపు చేస్తున్నారు.




పార్టీ అభ్యర్ధిని ప్రకటింపచేయటంలో వీలైనంత జాప్యం చేయటమే ఎంపీ ఉద్దేశ్యంగా కనబడుతోంది. లేకపోతే పీసీసీ చీఫ్ రేవంత్+ద్వితీయ శ్రేణినేతలు ప్రతిపాదిస్తున్న చల్లమల్ల కృష్ణారెడ్డిని కాదని పాల్వాయ్ శ్రవంతినే ఎంపికచేసేట్లుగా ఎంపీ తెరవెనుక నుండి ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణారెడ్డి ఆర్ధికంగానే కాకుండా పార్టీలోని చాలామంది మద్దతున్న నేతగా ప్రచారంలో ఉంది. ఇలాంటి నేత పోటీలో ఉంటే తమ్ముడు రాజగోపాలరెడ్డికి ఇబ్బంది అవుతుందని ఎంపీ నాటకాలు ఆడుతున్నట్లు పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి కోమటిరెడ్డి బ్రదర్స్ కు పార్టీ నేతలు పెద్ద షాకిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: