కేసీఆర్ ను ముంచేది ఆ ఎమ్మెల్యే లేనా ?

VAMSI
తెలంగాణ లో ప్రస్తుతం తెరాస అధికారంలో ఉంది.. కేసీఆర్ సీఎంగా గత ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతున్నారు. అయితే ఏపీలో లాగే ఇక్కడి ప్రజలు మరియు పార్టీలు అధికార పార్టీపై అంత సంతృప్తిగా లేరు. అందుకే విపక్షాలు అన్నీ కూడా కేసీఆర్ ను గద్దె దించాలన్న ప్రణాళికలో తలమునకలై ఉన్నారు. ఇక కేసీఆర్ కూడా వ్యతిరేక పార్టీలకు ధీటుగా అల్కచిస్తూ , వారి వ్యూహాలను తిప్పి కొడుతూ నెక్స్ట్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఈ సారి కూడా పార్టీని అధికారంలోకి తెచ్చి సీఎం గా హ్యాట్రిక్ కొట్టాలని ఆలోచనలో ఉన్నారు. అందుకే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించి ఈ ఎన్నికల వరకు తెరాస తరపున వర్క్ చేసి అధికారంలోకి తీసుకురావాలని కోరారు.
అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సర్వేల ద్వారా పార్టీ బలం ఏంటి ? బలహీనత ఏంటి ? అన్న విషయాలను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. అయితే ఈ సర్వేలో తెలిసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే... ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేలుగా ఉన్న 30 మంది రాబోయే ఎన్నికలలో తెరాస కు అధికారాన్ని రాకుండా చేస్తారని తన సర్వే రిపోర్ట్ లో పొందుపరిచారు. అంతే కాకుండా ఈ 30 మందికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కేసీఆర్ కు అందించారట. ఇక సదరు ఎమ్మెల్యేలు సైతం కేసీఆర్ తీసుకునే నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారట.
మరి కేసీఆర్ ఆ ఎమ్మెల్యే లకు వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తారా ? ఒకవేళ ఇస్తే పార్టీ అధికారంలోకి రావడం కష్టం అని తెలుస్తున్న తరుణంలో, ఒకవేళ టికెట్లు ఇవ్వకుంటే వారే పార్టీ కి వ్యతరేకంగా మారుతారన్న భయం కూడా లేకపోలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: