అమరావతి : రెండోసారి కూడా లవ్ లో ఫెయిలయ్యారా ?

Vijaya


లవ్ ప్రపోజల్ ను సక్సెస్ చేసుకోవటంలో చంద్రబాబునాయుడు రెండోసారి కూడా ఫెయిలయినట్లే ఉన్నారు. భవిష్యత్ రాజకీయాలు ఎలా మారుతాయో చెప్పలేంకానీ ఇప్పటికైతే రెండోసారి కూడా ఫెయిలైనట్లే అనుకోవాలి. మొదటి లవ్ ప్రపోజల్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పంపారు. అయితే పవన్ నుండి ఇప్పటివరకు ఎలాంటి సానుకూల స్పందన కనబడలేదు. దాంతో కుప్పం పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతు తానుపంపిన లవ్ ప్రపోజల్ కు జనసేన నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదని స్వయంగా ప్రకటించారు.అంటే చంద్రబాబు లవ్ ప్రపోజల్ ను పవన్ తిరస్కరించకపోయినా ఆమోదించలేదని మాత్రం చెప్పవచ్చు. ఈ రీతిలో మొదటి లవ్ లో చంద్రబాబు ఫెయిలయ్యారు. ఇక రెండో లవ్ ప్రపోజల్ బీజేపీకి పంపారు.  ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు. అయితే తాను పంపిన లవ్ ప్రపోజల్ బీజేపీ అంగీకరించిందని దీపావళినాటికి లవ్ సక్సెస్ అయి ఒకటైపోతాయని ఎల్లోమీడియా ద్వారా ఢిల్లీలోని మీడియాతో మ్యానేజ్ చేయించుకుని పదే పదే కథనాలు రాయించుకున్నారు.అయితే ఎప్పుడైతే కథనాలు బయటకువచ్చాయో చంద్రబాబు లవ్ ప్రపోజల్ లేదు మన్నూలేదు పొమ్మని బీజేపీ నేతలు గట్టిగా ఖండించారు. దాంతో బీజేపీకి పంపిన రెండో లవ్ ప్రపోజల్ కూడా ఫెయిలైందని అర్ధమైపోయింది. ఇక్కడ సమస్య ఏమిటంటే ఇద్దరిలో ఎవరో ఒకరితో లవ్ లో పడనిదే టీడీపీకి బతుకులేదన్న విషయం జనాలందరికీ తెలిసిపోయింది.జనసేనతో లవ్ సెట్టయితే ఓట్లు పడి సీట్లు వస్తాయన్నది చంద్రబాబు ఆశ. అలాగే బీజేపీతో లవ్ సెట్టయితే ఓట్లు, సీట్లు రాకపోయినా జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్లో ఉంచచ్చని, ఎన్నికల్లో అన్నీవైపుల నుండి బిగించేయచ్చన్నది చంద్రబాబు ఆలోచన. కేవలం జనసేనతో లవ్ సెట్టయినంత మాత్రాన చంద్రబాబుకు ఒరిగే లాభం పెద్దగా ఉండదనే అనుకోవాలి. బీజేపీతో కూడా లవ్ కుదిరితేనే తాను అనుకున్నట్లుగా ఉపయోగముంటుంది. అందుకనే పై రెండుపార్టీలతో ఒకేసారి లవ్ పండాలని చంద్రబాబు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. మరి రెండుపార్టీలతో చంద్రబాబు లవ్ సెట్టవుతుందా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: