అమరావతి : ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేకపోతున్నారా ?

Vijaya







ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబానాయుడు టెన్షన్ను తట్టుకోలేకపోతున్నారా ? అందుకనే నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారా ? తాజాగా చంద్రబాబు మాటలు విన్నతర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పట్టభద్రుల కోటాలో భర్తీ అవ్వాల్సిన మూడు ఎంఎల్సీల అభ్యర్ధులను ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతు రాష్ట్రం కోసం అవసరాలను బట్టి సమయానుకూలంగా పొత్తులపై నిర్ణయం తీసుకుంటామన్నారు.




ఇక్కడితో ఆగితే బాగనే ఉండేది కానీ ఆగితే తాను చంద్రబాబు ఎందుకవుతారు ? ఇప్పటివరకు తాను ఏ పార్టీతోను పొత్తుల విషయమై అసలు మాట్లాడనేలేదని బుకాయించారు. ఈ విషయంలో నేతలకు స్పష్టత ఇవ్వటం కోసమే తానీ విషయాన్ని చెబుతున్నట్లు కూడా చెప్పారు. ఇక్కడే చంద్రబాబులో ఫ్రస్ట్రేషన్ ఏ స్ధాయిలో పెరిగిపోతోందో అందరికీ అర్ధమైపోయింది. దాదాపు ఆరుమాసాల క్రితమే కుప్పం పర్యటనలో మాట్లాడుతు జనసేనతో పొత్తుగురించి మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే.



తాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు లవ్ ప్రపోజల్ పంపినా అక్కడినుండి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని రోడ్డుషోలో స్పష్టంగా చెప్పారు. తన ప్రపోజల్ కు ఆవైపునుండి ఎలాంటి సమాధానం రాకపోతే తానేం చేయాలని ఒక తమ్ముడిని చంద్రబాబు ప్రశ్నించారు. లవ్ ప్రపోజల్ అంటే ఇక్కడ పొత్తనే అర్ధమొచ్చేట్లుగా చంద్రబాబే ప్రకటించారు. మరి దాన్ని పొత్తుగురించి మాట్లాడటం అని అనరా ? ఇక బీజేపీతో అయితే పొత్తు పెట్టుకుని మళ్ళీ ఎన్డీయేలో చేరాలని చంద్రబాబు ఎంతగా ప్రయత్నిస్తున్నదీ అందరికీ తెలిసిందే.



జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీచేయాలని అందుకు టీడీపీ ముందుండి నాయకత్వం వహిస్తుందని ఎన్నోసార్లు రాష్ట్ర పర్యటనల్లో ప్రకటించింది వాస్తవంకాదా ? అన్నీపార్టీలు కలిసిపోటీచేయాలని అంటే అర్ధమేంటి ? పొత్తులు పెట్టుకోవాలనే కదా ? అనాల్సిన మాటలు, చెప్పాల్సిన మాటలు చెప్పేసి, చేసిన ప్రతిపాదనలన్నీ  రివర్సుకొట్టిందని అర్ధమైన తర్వాత ఇపుడు యూటర్న్ తీసుకున్నారు. ఇలాంటి మాటలు, చేష్టల వల్లే తనకు క్రెడిబులిటీ లేకుండా పోయిందని చంద్రబాబుకు అర్ధమవ్వటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: