కేసీఆర్ చెప్పగానే మోదీకి వ్యతిరేకంగా ఓట్లేస్తారా ?

VAMSI
బీజేపీ పాలనపై విపక్షాలు అసంతృప్తిగా ఉన్న మాట వాస్తవమే. అంతే కాకుండా కొందరు రాష్ట్రాల సీఎంలు మరియు ముఖ్య నేతలు అంతా ఏకం అయ్యి బీజేపీ ముక్త్ భారత్ ను సాధించడానికి కాలు దువ్వుతున్నారు. అందులో భాగంగా గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీ అధికారంలో లేని అన్ని రాష్ట్రాల నేతలను కలిసి చర్చలు జరుపుతున్నారు. రాజకీయం కాకుండా పాలన పరంగా చూస్తే బీజేపీ వలన ప్రజలు కూడా సంతోషంగా లేరన్నది తెలిసిందే. నిత్యావసరాలు అయిన గ్యాస్, వంట నూనెలు, పెట్రోల్ డీజిల్ ఎంత ధరలో ఉన్నాయో చూస్తూనే ఉన్నాము. అందుకే బీజేపీ అధికారంలోకి రాకూడదు అని చాలా మంది కోరుకుంటున్నారు.
ప్రస్తుతం కేసీఆర్ బీహార్ పర్యటనలో ఉన్నారు. అక్కడ సీఎం నితీష్ కుమార్ ను కలిసి ఏ విధమైన ప్రణాళికలు రచించుకోవాలి అన్న విషయం చర్చించుకున్నారు. అయితే బీజేపీ వ్యతిరేక పార్టీలలో కాంగ్రెస్ మినహాయించి అన్నీ కూడా స్థానిక పార్టీలే. అయితే కాంగ్రెస్ తో కలిసి వెళ్లి బీజేపీ తో పోరాడడం కేసీఆర్ తో సహా చాలా మంది నేతలకు ఇష్టం లేదు. ఇక కాంగ్రెస్ కూడా అన్ని పార్టీలను కలుపుకు పోవడానికి సిద్ధంగా లేదు. అయితే ఎవరికి వారు మాత్రం బీజేపీ అధికారం లోకి రాకూడదు అని కోరుకుంటున్నారు. అయితే సమిష్టిగా పోరాడితేనే గెలుపు దక్కుతుంది అన్న విషయం అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ వ్యతిరేక పార్టీలు అర్ధం చేసుకోవాలి.
అయినా ఇక్కడ మరో విషయం హైలైట్ అవుతోంది. వీరిలో వీరికే ఎన్ని అసమానతలు ఉండగా ? రేపు ఎన్నికల సమయానికి కావొచ్చు లేదా ఈ లోపు బీజేపీ వ్యతిరేక సమరానికి కావొచ్చు కేసీఆర్ మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయ్యండి అంటే ప్రజలు వేస్తారా ? అన్నది ప్రశ్నించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: