పవన్ కళ్యాణ్: ప్రభుత్వ నిర్ణయంపై ఫ్యాన్స్ ఆగ్రహం?

Purushottham Vinay
పవన్ కళ్యాణ్: టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లో అడుగుపెట్టి తన అన్న లాగే లక్షలాది అభిమానులను సంపాదించుకొని తన కంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే అంత స్టార్ డమ్ వున్నా కూడా పవన్ కళ్యాణ్ కి రాజకీయవేత్తగా ఎదిగి ప్రజాసేవ చేయాలని కోరిక. అందుకే జనసేన పార్టీ పెట్టాడు. ఇక అసలు విషయానికి వస్తే..పశ్చిమ గోదావరి జిల్లా తాడెపల్లిగూడెంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఒకరోజు ముందుగానే ప్రారంభించారు. రాష్ట్ర చిరంజీవి యూత్ అధ్వర్యంలో పట్టణంలోని వెంకటరామ థియేటర్ వద్ద జనసేనాని పుట్టినరోజు వేడుకని నిర్వహించారు.ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరైన పవన్ అభిమానులు, మెగా అభిమానులు హంగామా చేశారు. భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన కేకును రాష్ట్ర చిరంజీవి యూత్ ఉభయ గోదావరి జిల్లాల పార్లమెంట్ ఇంఛార్జి బోలిశెట్టి శ్రీనివాస్ కట్ చేశారు.కాగా, పవన్ పుట్టిన రోజు సందర్భంగా పెద్ద ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకలేకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 


రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా ఫ్లెక్సీలను ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మెగా అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఆపాలనే ఫ్లెక్సీలు బ్యాన్ చేశారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.ఈ సందర్భంగా బోలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ''పర్యావరణం గురించి ఆలోచించే ముఖ్యమంత్రి రిలయన్స్ కంపెనీ తయారు చేసే ప్లాస్టిక్ పదార్థాలను బ్యాన్ చేయాలి. మీ లిక్కర్ ప్లాస్టిక్ బాటిల్స్ ఎందుకు బ్యాన్ చేయడం లేదు? ఇతర పార్టీ నాయకులకు ఫ్లెక్సీలు కట్టకూడదనే దురుద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని వేలాది కుటుంబాలు రోడ్డున పడేసింది. ముఖ్యమంత్రి జగన్ హెలికాప్టర్‭లో కాకుండా రోడ్డుపై ప్రయాణిస్తే కష్టాలు తెలుస్తాయి'' అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: