4 ఏళ్లలోపు చిన్నారులకు ఉద్యోగాలు?

Purushottham Vinay
ఉద్యోగాలు అంటే పెద్ద వాళ్ళే చేస్తారు. అది కూడా అర్హతలు బట్టే చేస్తారు. కానీ చిన్న పిల్లలు ఉద్యోగాలు చెయ్యడం ఏంటి చాలా విచిత్రం.. అసలు వాళ్లకి ఏం తెలుసు..?అమ్మ ఒడిలో ఆటలాడుకునే ఈ చిన్న పిల్లలకు ఉద్యోగం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఇంకా అదీ కాక జీతం కూడా ఇస్తామనడంతో అందరూ కూడా ఆరాతీస్తున్నారు. కేవలం నాలుగేళ్ల లోపు చిన్నారులకు అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది ఓ నర్సింగ్ హోమ్.వారికి ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించింది.జపాన్ దేశంలోని కిటక్యూషులోని ఓ నర్సింగ్ హోమ్ ఒక ప్రకటన చేసింది. అక్కడ ఉంటోన్న వృద్ధులకు కంపెనీ ఇవ్వడానికి వారి మొహల్లో చిరునవ్వులు పూయించడానికి ఈ చిన్నారులను నియమించుకుంటోంది. ఉద్యోగాలు ఇచ్చే ముందు కాంట్రాక్ట్ కూడా తీసుకుంటుంది.అలాగే ఇక ఈ కంపెనీ పలు మినహాయింపులు కూడా ఇచ్చింది. పిల్లల వయసు నాలుగు సంవత్సరాలలోపే ఉండాలి. 


వారికి ఇష్టమైన సమయంలో నర్సింగ్ హోంకు రావచ్చు. ఆకలి వేసినా ఇంకా నిద్రగా అనిపించినా.. వారి మూడ్ ను బట్టి బ్రేక్ తీసుకోవచ్చని తెలిపింది.ఇంకా 80 ఏళ్ల వయసులో ఉన్న 100 మంది వృద్ధులు ఇక్కడ ఉన్నారు. ఇప్పటివరకూ 30 మంది చిన్నారులను ఈ కాంట్రాక్టు కింద తీసుకున్నట్లు తెలిపారు. ఈ చిన్న పిల్లలను చూస్తే ఈ ముసలి వయసు మళ్లిన వారి ముఖంలో నవ్వు తెచ్చే ప్రయత్నం చేస్తారు. షిఫ్టుల లాంటివి ఏవీ ఉండవని.. ఈ ఉద్యోగంలో చేరిన వారు తమ గార్డియన్ తో కలిసి ఈ నర్సింగ్ హోం మొత్తం షికారు చేయడమే పని అన్నారు. వారికి జీతం కింద డ్రైవర్లు మిల్క్ పౌడర్ ఇస్తున్నట్లు తెలిపారు.చిన్న పిల్లలను తీసుకురావడం.. ఆ వృద్ధుల్లో మంచి ఫలితాలను ఇస్తోందని.. తమ మనవలు మనవరాళ్లతో గడిపినట్లే ఫీల్ అవుతున్నారని వెల్లడించారు.ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: