చంద్రబాబు పై దాడి జరిగితేనే తమ్ముళ్లలో కసి వస్తుందా ?

VAMSI
ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికలకు ఇంకా ఇరవై నెలల సమయం ఉంది. అయినప్పటికీ ఇప్పటి నుండే ఏపీలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా గెలుపే లక్ష్యంగా తమ రాజకీయ ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఎన్నికలలో పోటీ చేసే ప్రతి రాజకీయ పార్టీ కూడా గెలవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఏపీలో చాలా కాలం నుండి పోటీ మాత్రం రెండు పార్టీల మధ్యనే ఉంటూ వస్తోంది. అందులో ఒకటి అధికార పార్టీ వైసీపీ అయితే, మరొకటి ప్రతిపక్షం టీడీపీ. ఇక పోతే ఈ టీడీపీతో జనసేన ఎన్నికల సమయానికి కలుస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే... వచ్చే ఎన్నికలలో ఎలాగైనా జగన్ ను గద్దె దించడానికి విపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
అయితే టీడీపీ గెలవాలి అని అనుకుంటోంది. కానీ గెలవాలి అంటే అందుకు పార్టీలో పార్టీకోసం ప్రతి ఒక్కరు కలిసి పనిచేస్తేనే అది సాధ్యం అవుతుంది. కానీ టీడీపీలో మాత్రం పరిస్థితి అలా లేదు. కార్యకర్తలు కావొచ్చు లేదా ప్రధాన నాయకులు కావొచ్చు... ఎవరూ కూడా పార్టీతో ఆంటీ అంటినట్లుగా ఉంటున్నారు. దీని వలన పార్టీకి తీవ్ర నష్టం కలుగుతోంది. ప్రజల్లోకి పార్టీని తీసుకువెళ్లడంలో దారుణంగా విఫలం అవుతున్నారు. ఏదైనా పార్టీకి నష్టం కలిగిన తర్వాతనే టీడీపీ తమ్ముళ్లలో కసి వస్తోంది. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనలో వైసీపీ నాయకులు అన్న క్యాంటీన్ లను ధ్వంసం చేయడం, చంద్రబాబు పై రాళ్లతో దాడి చేయడం జరిగింది.
దీనితో ఎక్కడున్నారో కానీ టీడీపీ తమ్ముళ్లు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పై మరియు జగన్ పై విమర్శలు చేయడం.. కింది స్థాయి నుండి ఎక్కడికక్కడ మీటింగ్ లు పెట్టుకుని పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు పడ్డాయి. కానీ ఎప్పుడైనా పార్టీకి చెడు జరిగినప్పుడే ఇలా కసితో వ్యవహారించాలా ? మిగిలిన సమయంలో ఆ పౌరుషం ఎక్కడికి పోయిందంటూ చంద్రబాబు కూడా చాలా సందర్భాల్లో తన బాధను పంచుకున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: