ఢిల్లీ : జనసేన సీనేంటో ఎంపీ తేల్చేశారా ?

Vijaya






జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు బయటపెట్టారు. తాజాగా ఎంపి చెప్పిన సర్వే వివరాలు నిజమని అనుకుంటే పవన్ కు జనాలు పెద్ద షాకివ్వటం ఖాయమని తేలిపోయింది. ఎలాగంటే జూన్-జూలైలో ఎంపీ ఒక ప్రత్యేక యాప్ ద్వారా రాష్ట్రమంతా సర్వేచేయించారట. సర్వే విశ్వసనీయతను ఎవరు అడగకూడదు. రఘురాజు చేయించిన సర్వేలో టీడీపీకి  93 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తేలిందట. అంటే టీడీపీ, వైసీపీ, జనసేన దేనికదే పోటీచేస్తే అనుకుని సర్వే చేయించినట్లున్నారు.



అలాగే ఒకసారేమో వైసీపీకి పదిసీట్లు వస్తాయని చెప్పిన రాజు మరోసారి 73 సీట్లు దాకా వస్తుందన్నారు. 68 సీట్లలో టైట్ ఫైట్ జరిగే అవకాశముందని, అన్నీకూడా వైసీపీనే గెలిస్తే తమపార్టీకి 80 సీట్లు వస్తాయన్నారు. అలాగే సర్వేలో టీడీపీ+జనసేన కలిస్తే వార్ వన్ సైడే అని చెప్పారు. రెండుపార్టీలు కలిస్తే దాదాపు 160 సీట్లదాకా వచ్చేస్తాయన్నారు.  అయితే సర్వే మొత్తంమీద టీడీపీ గెలుచుకోబోయే సీట్లు, వైసీపీ తెచ్చుకునే సీట్ల సంఖ్యనే చెప్పారు కానీ జనసేన గురించి ఏమీ చెప్పలేదు.



మరి మూడుపార్టీల విషయంలో ఎంపీ చెప్పిన లెక్కలను ప్రామాణికంగా చూస్తే టీడీపీ+వైసీపీ 173 సీట్లలో గెలుస్తాయి. మరి జనసేన గెలిచే సీట్ల మాటేమిటి ? అంటే జనసేనకు వచ్చేది కేవలం 2 సీట్లేనా లేకపోతే ఆ సీట్లుకూడా రావా ? అన్నదే అనుమానంగా ఉంది. విచిత్రం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో రఘురాజు జనసేన పార్టీ తరపున నరసాపురం ఎంపీగా మళ్ళీ పోటీచేయాలని అనుకుంటున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. రెండుపార్టీలు గెలుచుకోగా మిగిలిన రెండుసీట్లను పవనే గెలుచుకుంటారని అనుకున్నా జనసేన సీనేంటో జనాలకు ఎంపీ చెప్పేసినట్లే.




2019 ఎన్నికల్లో జనసేన ఒక్క సీటులో మాత్రమే గెలిస్తే ఐదేళ్ళ ప్రభుత్వ వ్యతిరేక పోరాటం తర్వాత గెలిచేది కేవలం అదనంగా మరో సీటు మాత్రమేనా ? ఒకవైపు పవనేమో తానే అధికారంలోకి వచ్చేస్తానని పదే పదే చెబుతున్నారు. మరోవైపు ఎంపీ చేయించిన సర్వేలో జనసేనకు అసలు ఒక్కసీటు వస్తుందని కూడా రాలేదు. అంటే పవన్ సీనేంటో జనాలకు బాగా అర్ధమైపోయినట్లే ఉంది. జనసేన స్ధాయేంటో ఎంపీ బయటపెట్టడం ద్వారా పవన్ కు పెద్ద షాకిచ్చినట్లేనా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: