ఢిల్లీ : సర్వేలో టీడీపీ అధికారంలోకి వచ్చేసినట్లేనా ?

Vijaya






వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్నిసీట్లు వస్తాయనే విషయంలో వైసీపీ తిరుగుబాటు ఎంపీ చేయించిన సర్వేపై అనేక కామెంట్లు వినబడుతున్నాయి. హోలు మొత్తంమీద చూస్తే కనీసం తన సర్వేలో అయినా టీడీపీని అధికారంలోకి తీసుకురావాలన్న తాపత్రయం బాగా కనబడుతోంది. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందో రాదో ఎవరు చెప్పలేకున్నారు. అందుకనే సర్వే చేయించి టీడీపీదే అధికారం గ్యారెంటీ అని చెప్పే ప్రయత్నం చేశారు.




ప్రత్యేక యాప్ ద్వారా జూన్, జూలైలో సర్వే చేయించారట. ఆ సర్వే ప్రకారం టీడీపీ గ్యారెంటీగా 54 సీట్లు గ్యారెంటీనట. మరో 39 సీట్లలో గెలిచే అవకాశముందట. అంటే టీడీపీకి హోలు మొత్తంమీద 93 సీట్లువస్తాయని తేల్చారు. అలాగే వైసీపీ గ్యారెంటీగా గెలిచేసీట్లు, గెలుపు అవకాశమున్న సీట్లు కలిపి 12 సీట్లు మాత్రమేనట. ఇక రెండుపార్టీల మధ్య 68 సీట్లలో  టైట్ ఫైట్ జరుగుతుందట. ఒకవేళ అన్నీసీట్లూ వైసీపీనే గెలుచుకున్నా మ్యాగ్జిమమ్ 80 సీట్లకన్నా గెలవదట.



అంటే ఎంపీ చేయించిన సర్వే ప్రకారం టీడీపీకి 93 సీట్లు, వైసీపీ 80 సీట్లు గ్యారెంటీ. ఇక్కడే 173 సీట్లయిపోతే మరి జనసేన గెలిచే సీట్లెన్నో తెలీదు. అంటే మిగిలిన 2 సీట్లు జనసేన గెలుస్తుందా లేకపోతే టీడీపీ, వైసీపీలే గెలుస్తాయా అన్నది చెప్పలేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇదే ఎంపీ ఒకపుడు వైసీపీ 15 సీట్లలో కన్నా గెలవదని చెప్పారు. మరిపుడేమో 80 సీట్లలో గెలుస్తుందంటున్నారు. ఎంపీ చెప్పిన పై రెండు ప్రకటనల్లో ఏది కరెక్టో ఎవరికీ అర్ధం కావటంలేదు.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎలాగైనా సరే టీడీపీ అధికారంలోకి వచ్చేయాలన్నది రఘురాజుకి బలమైన కోరికుంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మీద కక్ష మరోవైపు చంద్రబాబు మీద ప్రేమ ఎంపీలో రోజురోజుకు పెరిగిపోతోంది. కక్ష+ప్రేమలో నుండి పుట్టుకొచ్చిందే తాజా సర్వే రిపోర్టు. వైసీపీకి ఒక్కసీటులో కూడా గెలవదని చెబితే  జనాలు నవ్వుకుంటారని అనుకున్నారోమో అని 12 సీట్లిచ్చారు. మొత్తంమీద ఎంపీ బాగా ఉదారహృదయుడనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: