రాయలసీమ : జగన్ దెబ్బకు నియోజకవర్గాన్ని వదలటంలేదుగా ?

Vijaya

ఏ ముహూర్తంలో కుప్పంపై జగన్మోహన్ రెడ్డి దృష్టిపెట్టారో కానీ అప్పటినుండి చంద్రబాబునాయుడుకు మనశ్శాంతి లేకుండా పోయింది. గడచిన 37 ఏళ్ళల్లో ఏడాదికి ఒకసారో లేకపోతే రెండుసార్లో చంద్రబాబు కుప్పంలోకి అడుగుపెడితే అదేగొప్ప. చివరకు ఎన్నికల్లో నామినేషన్ వేయటానికి కూడా వెళ్ళేవారు కాదు. అలాంటిది గడచిన మూడేళ్ళుగా ప్రతినెల లేకపోతే రెండునెలలకు ఒకసారి నియోజకవర్గానికి వెళుతున్నారు. వెళ్ళినప్రతిసారి మూడురోజులు అక్కడే మకాం వేస్తున్నారు.ఇపుడు ఇదంతా ఎందుకంటే 24-26 మధ్య మూడురోజులు కుప్పంలో పర్యటించబోతున్నారు. ఇన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలోని నేతలను ప్రలోభపెట్టి లేదా మభ్యపెట్టి ఏదోరూపంలో లొంగదీసుకుని తనకు ఎదురులేదని అనిపించుకుంటున్నారు. అందుకనే సర్పంచ్ నుండి అసెంబ్లీ వరకు ఎన్నిక ఏదైనా టీడీపీకి ఏకపక్షంగా సాగిపోయేది. ఎప్పుడైతే జగన్ అధికారంలోకి వచ్చారో అప్పటినుండే కుప్పంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.జగన్ దెబ్బకు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటి ఎన్నికలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. దెబ్బకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో వణుకుమొదలైంది. రేపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చంద్రబాబును ఓడించటమే జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారు. గెలవకపోతే రాజకీయ క్లైమ్యాక్సు అత్యంత దారుణంగా ముగుస్తుందనే భయంవల్లే చంద్రబాబు రెగ్యులర్ గా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే ఎంత పర్యటించినా ఏమి చేయగలరు అనేదే ప్రశ్న. చంద్రబాబును ఓడించటమే టార్గెట్ గా ప్రభుత్వం సంక్షేమపథకాలను పక్కాగా అమలుచేస్తోంది.
ఒకవైపు కుప్పం మున్సిపాలిటిలో అభివృద్ధి కార్యక్రమాలు, మరోవైపు సంక్షేమపథకాలు అమలవుతున్నాయి. దాంతో వైసీపీ నేతలు ఫుల్లుజోషుమీదున్నారు. ఇదే సమయంలో చేసిన తప్పులను దిద్దుకోలేక టీడీపీ నేతలంతా చెల్లాచెదురైపోతున్నారు. చెప్పుకోవటానికి సీఎం నియోజకవర్గమే కానీ పెద్దగా డెవలప్ కాలేదు. కుప్పాన్ని చివరకు మున్సిపాలిటి కూడా చంద్రబాబు చేయలేకపోయారు. దాన్ని కూడా జగన్ చేయాల్సొచ్చింది. మంచినీటి సౌకర్యాన్ని కూడా జగన్ ఏర్పాటుచేస్తున్నారు. మరి 40 ఏళ్ళల్లో చంద్రబాబు రాజకీయం తప్ప ఏ విధమైన అభివృద్ధి చేయలేదని అర్ధమైపోయింది. జనాల మూడ్ అర్ధమయ్యే చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: