షాకిచ్చిన బాతుల గుంపు.. రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేశాయి?

praveen
సాధారణంగా ఏదైనా అర్జెంట్ పని ఉండి తొందరగా వెళ్ళాలి అనుకున్న సమయంలో ఊహించని విధంగా ఏదో ఒక అంతరాయం ఏర్పడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇలాంటి అంతరాయం ఏర్పడిన సమయంలో ప్రతి ఒక్కరూ కూడా కాస్త అసహనం వ్యక్తం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి అంతరాయం మనుషుల నుంచి కాదు జంతువులు పక్షుల నుంచి వచ్చింది అంటే ఏమి చేయలేని పరిస్థితి లోకి వెళ్ళి పోతూ ఉంటారు. ఇక్కడ ఇలాంటి సిచువేషన్ ఫేస్ చేశారు కొంతమంది వ్యక్తులు.

 సాధారణంగా బాతులు రోడ్డుపై ఏకంగా కలిసికట్టుగా గుంపుగా వెళ్లడం లాంటివి చూస్తూ ఉంటాం. ఇక అలాంటి సమయంలో రోడ్డుపై ఏదైనా వాహనం వచ్చినా కూడా దానికి అసలు దారి ఇవ్వకుండా అసలు ఆ కార్ వచ్చింది అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా బాతులు వాటి దారిలో అవి వెళ్తూ ఉంటాయి. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాంటి అనుభవమే ఎదురైంది. కారు నడిరోడ్డు మీద చిక్కుకుంది అని చెప్పాలి. వందలాది బాతుల మధ్య కారు ఆగిపోయింది. ఇక ఎటు వెళ్లడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఒక రకంగా ఆ కారును రౌండప్ చేసి అందులో ఉన్న డ్రైవర్ను కన్ఫ్యూజన్లో  పడేశాయి అని చెప్పాలి.

 ఇక ఆ తర్వాత ఒక కార్ నిలిచిపోయిన కారణంగా వెనకాల ఎన్నో కార్లు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది. చివరికి కొన్ని గంటలపాటు అక్కడే నిరీక్షణలో ఎదురుచూసినా డ్రైవర్  బాతులు మొత్తం వెళ్లిపోయిన తర్వాత అప్పుడు కార్ తో అక్కడి నుంచి ముందుకు వెళ్ళాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. అయితే ఆ బాతులు అన్నీ ఒక్కసారిగా ఎందుకు రోడ్డు మీదికి వచ్చాయి అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: