బాబోయ్.. పోలీసులను అద్దెకిస్తారట.. ఎక్కడో కాదు?

praveen
కాలం మారుతున్న కొద్దీ సభ్య సమాజంలో జరుగుతున్న ఎన్నో విషయాలలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇక ఇలాంటి మార్పులు ఎంతో మందిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవలి కాలంలో ఏకంగా అద్దెకు ప్రియురాలిని ఇవ్వడం.. లేదా భార్యలను, భర్తలను కూడా అద్దెకు ఇవ్వడం లాంటి ఘటనలు వెలుగుచూశాయి. ఇవన్నీ పాశ్చాత్య దేశాలలో జరుగుతున్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా పోలీసులను కూడా అద్దెకు ఇవ్వబోతున్నారు. అట వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగానే జరుగుతుంది.

 ఇది ఎక్కడో విదేశాల్లో అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే. ఏకంగా మనదేశంలోనే ఇలాంటి ఆఫర్ అందుబాటులో ఉంది. అది కూడా దక్షిణ భారత దేశంలో. కేరళ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ చట్టం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. ఇక ఈ చట్టం నిబంధనల ప్రకారం ఎవరైనా సరే పోలీస్ అధికారులను అద్దెకు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. పోలీస్ అధికారి హోదాను బట్టి ఇక చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. పోలీసులు మాత్రమే కాదు పోలీస్ స్టేషన్ లను కూడా అద్దెకు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం 33 వేల ఒక వంద రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది.

 ఇక పోలీసు అధికారులకు అయితే  ర్యాంక్‌ ఆధారంగా ఫీజు చెల్లించాలట . సీఐ అధికారికి పగటి పూట రూ.3,795, రాత్రికి రూ.4,750 చెల్లించాలి. ఎసై కేడర్ అధికారికి పగలు రూ.2,560, రాత్రికి రూ.4,360లు చెల్లించాలి. పోలీసు శునకాలను కూడా అద్దెకు తీసుకోవచ్చు. దీనికోసం  రూ.6,950 అద్దె చెల్లించాలి. అంతేకాదండోయ్  పోలీసు అధికారులు ఉపయోగించే వైర్‌లెస్ పరికరాలు కూడా అద్దెకిస్తారట. వీటి ఖరీదు రూ.2,315 వరకు ఉంటుందట. అయితే ఈ చట్టాన్ని మాత్రం అటు పోలీసులు వ్యతిరేకిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇటీవలే అన్సర్ అనే వ్యక్తి తన కుమార్తె పెళ్లి నిమిత్తం విఐపి సెక్యూరిటీ కోసం నలుగురు కానిస్టేబుళ్లను అద్దెకు మాట్లాడుతున్నాడు. కానీ ఆ వివాహానికి ఎవరు వీఐపీలు హాజరు కాకపోవడం గమనార్హం. ఏమైనా కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం మాత్రం ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తోందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: