అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్: గోరంట్ల డర్టీ పిక్చర్ రియల్?

Purushottham Vinay
ఇటీవల వైసీపీ నేత హిందూ పురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దేశంలో ఇంకేం సమస్యలు లేవన్నట్లుగా ఇదే పెద్ద దేశ సమస్యగా వివక్షాలు దీనిపైనే తమ ఫోకస్ పెట్టి తెగ చర్చలు జరుపుతున్నాయి.అయితే అగ్రరాజ్యం అమెరికా వరకు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ వెళ్లింది. అక్కడి ఫోరెన్సిక్ ల్యాబ్ ఆ వీడియో మార్ఫింగ్ కాదని, రియల్ అంటూ అమెరికా తేల్చింది.ఆ రిపోర్టును టీడీపీ నేతలు శనివారం నాడు బయటపెట్టారు.ఇక అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్స్ ల్యాబ్ ఆ వీడియోను పరిశీలించింది. ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా విడుదల చేసింది.అలాగే ఇందులో పలు అంశాల్ని ల్యాబ్ ప్రస్తావించింది. ఇక ఎస్పీ ఫకీరప్ప చెప్పిన విషయాలకు భిన్నంగా ఈ నివేదిక వచ్చింది. దీంతో ఆ నివేదికను వైరల్ చేసే పనిలో ఇప్పుడు టీడీపీ ఉంది.ఎక్లిప్స్ ల్యాబ్ కు ఆగస్టు 9 వ తేదీన ఆ వీడియో వచ్చిందని తెలిపింది. పోతిని అనే వ్యక్తి పరీక్షల కోసం పంపారని ఆ ల్యాబ్ వెల్లడించింది.


 ఇది మార్ఫింగ్ చేశారా లేక ఒరిజినలేనా? తేల్చాలని కోరినట్లు కూడా తెలిపింది. ఎస్పీ ఫకీరప్ప చెప్పినట్లుగానే ఈ వీడియో ఫోన్ లో రికార్డ్ చేశారని వారు తేల్చారు. ఇక రికార్డ్ చేసిన ఈ వీడియో నిజమేనని, ఇది అసలు ఎడిట్ చేసింది కాదని తెలిపింది.హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు సంబంధించి వైరల్ అవుతున్న ఈ నగ్న వీడియో అసలు రియల్ కాదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించిన నేపథ్యంలో దీనిపై ఇప్పుడు పెద్ద చర్చ అనేది జరుగుతోంది. ఇది నిజమా కాదా తేల్చాల్సింది ఫోరెన్సిక్ నిపుణులకు భిన్నంగా పోలీసులు ఎలా తేలుస్తారంటూ విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. దీనిపై విచారణ జరపాలని జాతీయ మహిళా కమిషన్ డీజీపీతో పాటు లోక్ సభ స్పీకర్ ను కూడా కోరడం జరిగింది. తాజాగా  దీన్ని రియల్ గా నిర్ధారించేలా అమెరికా ఫోరెన్సిక్ రిపోర్ట్ బయటికి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: