అమరావతి : కేంద్రంలో జగన్ కీలకపాత్ర పోషించనున్నారా ?

Vijaya


తాజా రాజకీయ పరిణామాల్లో కేంద్రప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి మద్దతు అవసరం ఉంటుందా ? ఉంటుందనే అనిపిస్తోంది. ఇండియు టు డే మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో జరిపిన సర్వేలో ఈ సంకేతాలు కనబడుతున్నాయి. ఇప్పటికిప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే పార్టీల పరిస్ధితి ఏమిటనే విషయమై ఇండియా టు డే సర్వే జరిపింది. ఈ సర్వేలో ఏపీ పరిస్ధితి ఎలాగున్నా ఎన్డీయే కూటమికి 286 లోక్ సభ సీట్లు వస్తాయని చెప్పింది. పైగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీయేని విడిచిపెట్టేయటం జగన్ కు కలిసివచ్చేట్లుంది. ఇదే సమయంలో యూపీఏ కూటమికి 146 సీట్లొస్తాయట. ఇక నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలకు 111 సీట్లు వస్తాయని తేల్చింది. నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీల్లో వైసీపీ కూడా ఉన్నది. వైసీపీకి 18 సీట్లు వస్తాయని సర్వే చెప్పింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎన్డీయే బలం ఒకప్పటికన్నా తాజా సర్వేలో తగ్గిపోయింది. పైగా జేడీయూ ఎన్డీయేలో నుండి వెళ్ళిపోవటంతో లోక్ సభలో 16+రాజ్యసభలో ఐదుగురు అంటే మొత్తం 21 మంది ఎంపీల బలం తగ్గిపోయింది.రేపు రాజ్యసభలో ఏ బిల్లు పాసవ్వాలన్నా కచ్చితంగా నాన్ ఎన్డీయే పార్టల బలం చాలా అవసరం. ఇందుకే వైసీపీ మద్దతు మీద ఆధారపడక తప్పదు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే బలంగనుక బాగా పడిపోతే చివరకు ప్రభుత్వం ఏర్పాటుకు వైసీపీ మద్దతు లేకుండా సాధ్యంకాదు.  ఈ నేపధ్యంలోనే ఆగష్టు 17వ తేదీన మోడీతో జరగబోయే జగన్మోహన్ రెడ్డి సమావేశం కీలకంగా మారింది. ఇప్పటికిప్పుడు లోక్ సభలో జగన్ మద్దతు మోడీకి అవసరంలేదు. కానీ రేపటి ఎన్నికల్లో బీజేపీ బలంగనుక పడిపోతే ?
అప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు మోడీకి వేరేదారిలేక జగన్ దగ్గరకు రావాల్సిందే.  సో ఏ పద్దతిలో చూసుకున్నా ఇపుడు రాజ్యసభలో బిల్లులు గట్టెక్కాలన్నా, రేపటి ఎన్నికల తర్వాత బీజేపీ బలంపడిపోయినా జగనే మోడీకి దిక్కు. ఎందుకంటే పేరుకు ఎన్డీయేనే అయినా బీజేపీ లేకపోతే ఎన్డీయే బలం సున్నాయే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: