అమరావతి : వచ్చే ఎన్నికల్లో కూడా జగన్ గ్యారెంటీయేనా ?

Vijaya






ఎవరినోటవిన్నా వచ్చేఎన్నికల్లోకూడా జగన్మోహన్ రెడ్డే అధికారంలోకివస్తే రాష్ట్రాన్ని భగవంతుడు కూడా కాపడలేడని పదే పదే చెబుతున్నారు. తాజాగా బీజేపీ మీటింగులో సుజనా చౌదరి మాట్లాడుతు వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్ళీ సీఎం అయితే రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరన్నారు. ఇదే విషయమై చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, వామపక్షాల నేతలు కూడా చెబుతున్నారు. అంటే వీళ్ళందరి ఉద్దేశ్యంలో వచ్చేఎన్నికల్లో కూడా గ్యారెంటీగా జగనే సీఎం అవుతారని ఉన్నట్లుంది.




వీళ్ళు ప్రధానంగా ఏవైతే అంశాలను ప్రస్తావిస్తున్నారో అవన్నీ చంద్రబాబు హయాంలో కూడా జరిగాయి. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవటం చంద్రబాబు హయాంలోనే మొదలైంది. ప్రత్యర్ధులపై దాడులు జరగటం, కేసులు పెట్టడం టీడీపీ హయాంలో కూడా జరిగినాయి. అత్యాచారాలు, హత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు జరగటానికి అధికారంలో ఎవరున్నారనేదాంతో సంబంధంలేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా జరిగేవి జరుగుతునే ఉంటాయి.  



ఇక పోలవరం కంపంతా పూర్తిగా చంద్రబాబుదే అనటంలో సందేహంలేదు. కేంద్రమే నిర్మించాల్సిన ప్రాజెక్టును బలవంతంగా తన చేతిలోకి తీసుకున్నదే చంద్రబాబు. కేవలం కమీషన్లకోసమే కక్కుర్తిపడి ప్రాజెక్టును రాష్ట్రపరిధిలోకి తీసుకురాకుండా ఉంటే దాని సమస్యలేవో కేంద్రప్రభుత్వమే చూసుకునేది. ఇక ఐదేళ్ళు అధికారంలో ఉంది అమరావతి రాజధాని గ్రాఫిక్స్ లో చూపించి జనాలను మాయచేసిందెవరు ? జనాలను మాయచేయకుండా వాస్తవ పరిస్ధితులకు తగ్గట్లుగా నిర్మాణాలు చేసుంటే ఈ పాటికి రాజధాని పక్కాగా పూర్తయిపోయేదే.




ఏ రంగాన్ని తీసుకున్నా కంపుచేసింది ముందు చంద్రబాబే. ఎందుకంటే విభజిత రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రయ్యింది చంద్రబాబు కాబట్టే. ఫార్టీ ఇయర్స్ చేసిన కంపునే జగన్ కూడా కంటిన్యు చేస్తున్నారు. కాకపోతే తెచ్చిన అప్పులకు సంక్షేమపథకాల రూపంలో చాలావరకు జవాబుదారీగా ఉన్నారు. చంద్రబాబు హయాంలో రు. 1.10 లక్షల కోట్లకు అసలు లెక్కలే లేవని ఈమధ్యే కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్ రెండోసారి సీఎం అయితే చంద్రబాబు, ఎల్లోమీడియాతో పాటు పవన్+సుజనా లాంటివాళ్ళపనైపోతుంది. అందుకనే జగన్ సీఎం అయితే రాష్ట్రం నాశనమంటు నానా గోలచేస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: