అమరావతి : హిందుపురం ఎంపీ వీడియోపై కీలకమలుపు

Vijaya


హిందుపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కీలకమలుపు తిరిగిందా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అదే అనుమానాలు పెరిగిపోతోంది. మాధవ్ ఉన్న వీడియోకి సంబంధించి రెండు విషయాలు జరిగాయి. మొదటిదేమో మాధవ్ కు అనుకూలంగా వ్యతిరేకంగా కదిరి, అనంతపురంలో పెద్దఎత్తున ప్రదర్శనలు జరగటం. రెండోదేమిటంటే ఆ వీడియోలో ఉన్నది తానుకాదని చెబుతు గాండ్లపెంట గ్రామానికి చెందిన అనితారెడ్డి పోలీసులకు ఫిర్యాదుచేయటం.తన ఫొటోని మార్ఫింగ్ చేసి టీడీపీ-జనసేన పార్టీల వాళ్ళు తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు. కాబట్టి విచారణ జరిపి బాధ్యుతలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటు స్వయంగా ఎంపీయే ముగ్గురిపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఎంపీ ఫిర్యాదు ఆధారంగా సైబర్ సెల్ నిపుణులు వీడియోను పరిశీలిస్తున్నారు.ఒకవైపు పోలీసుల దర్యాప్తు జరుగుతుండగానే కమ్మ-కురబ కుల సంఘాల మధ్య గొడవలు మొదలైపోయాయి. తమకులాన్ని ఎంపీ అవమానించాడంటు కమ్మ కులసంఘంలోని కొందరు పెద్దఎత్తున ప్రదర్శనచేశారు. వెంటనే ఎంపీని అరెస్టుచేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కురబ కులానికి చెందిన ఎంపీపై కావాలనే కమ్మ సామాజికవర్గానికి చెందిన మీడియా దుష్ప్రచారం చేస్తున్నట్లు కురబసంఘం నేతలు పోటీగా మరో ప్రదర్శన చేశారు. దాంతో కదిరి పట్టణంలో ఉద్రిక్తత దారితీసింది.వీళ్ళగొడవలు సాగుతుండగానే గాండ్లపెంట గ్రామానికి చెందిన అనితారెడ్డి ఫిర్యాదు చేయటం గమనార్హం. మాధవ్ వీడియోలో తన ఫొటోని మార్ఫింగ్ చేసి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆమె టీడీపీ, జనసేన నేతలను నిలదీస్తున్నారు. అసలు ఈ వీడియో దాదాపు మూడు నెలల నుండి అమ్మకానికి మార్కెట్లో చక్కర్లు కొడుతోందని మరో సమాచారం. వైసీపీ వాళ్ళేమో సదరు వీడియోని వైసీపీకి చెందిన ఒక ఎంపీయే కొనుగోలు చేసి ఎల్లోమీడియా ద్వారా సర్క్యులేట్ చేసినట్లు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ఎంపీ న్యూడ్ వీడియో గొడవ రోజుకో మలుపుతిరుగుతోంది. చివరకు ఈ గొడవ ఎక్కడ ఆగుతుందో ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: