రాయలసీమ : కుప్పానికి ముహూర్తం ఫిక్సయ్యిందా ?

Vijaya


కుప్పం నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబునాయుడును ఓండిచాలనే పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు అన్నీ కుప్పంలో పక్కాగా అమలయ్యేట్లుగా చర్యలు తీసుకుంటున్నారు. కుప్పం నేత భరత్ కు ఎంఎల్సీ పదవి ఇచ్చి నియోజకవర్గం మొత్తం రెగ్యలర్ టచ్ లో ఉండేట్లు చూస్తున్నారు. ఓవరాలుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.ఆగష్టు 4వ తేదీనుండి మొదలవ్వబోతున్న కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని జగన్ కుప్పంనుండే మొదలుపెడుతున్నారు. ప్రతి నియోజకవర్గం నుండి 50 మంది కార్యకర్తలను ఎంపికచేసి వాళ్ళతో సమావేశమవ్వాలని జగన్ గతంలోనే డిసైడ్ చేసిన విషయం తెలిసిందే. గురువారం నుండి ప్రారంభమయ్యే సమావేశాలు కుప్పం నుండే మొదలవ్వబోతున్నాయి. కార్యకర్తలతో మాట్లాడేటపుడు ఎంఎల్ఏ పనితీరు, ప్రభుత్వంపై జనాల్లో ఉన్న అభిప్రాయాలు, పథకాలు, కార్యక్రమాలు అర్హులైనవారికి అందుతున్న విషయాలను చర్చించబోతున్నారు.వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితి ఏమిటి, ప్రత్యర్ధిపార్టీల బలాలు, బలహీనతలపైన కూడా జగన్ ఫీడ్ బ్యాంక్ తీసుకోబోతున్నారు. కార్యకర్తల నుండి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా వచ్చే ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో టికెట్లు ఫైనల్ చేసిన ఆశ్చర్యపోవక్కర్లేదనే ప్రచారం మొదలైపోయింది. కొంతకాలంగా తమతో జగన్ సమావేశమవ్వాలని, పార్టీ, ప్రభుత్వం పనితీరుపై జనాల్లో ఉన్న అభిప్రాయాలను తెలుసుకోవాలని కార్యకర్తల్లో కొందరు సోషల్ మీడియాలో బాగా  డిమాండ్లు పెరుగుతున్నాయి.ఈ విషయం జగన్ దృష్టికి వెళ్ళింది. ఎలాగూ ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి కార్యకర్తలతో రెగ్యులర్ టచ్ లో ఉండాలని జగన్ అనుకున్న తర్వాత కార్యకర్తలతో ఆగష్టు 4వ తేదీనుండి భేటీలు మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు. అంతకుముందు పార్టీ శ్రేణులు లేదా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా పనిచేస్తున్నవారికి ఉద్యోగాలిప్పించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే పదులసంఖ్యలో తిరుపతి, గుంటూరు, విశాఖపట్నంలో జాబ్ మేళాలు నిర్వహించి సుమారు 40 వేలమందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలిప్పించారు. మొత్తానికి కుప్పంకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటో అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: