అమరావతి : అయోమయంలో ఎల్లోమీడియా ?

Vijaya






జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా రాయటం ఒకటే టార్గెట్. అయితే ఆ రాయటమన్నా పద్దతిగా రాస్తున్నారా అంటే అదీలేదు. బుర్రకు ఎంత తోస్తే ఆ చెత్తంతా అచ్చేసి జనాలపైకి వదిలేస్తున్నారు. తాజాగా అచ్చయిన రెండు కథనాలే ఇందుకు ఉదాహరణ. అచ్చయిన రెండు కథనాలు కూడా పరస్పర విరుద్ధంగా ఉండటమే ఇక్కడ విచిత్రం.  జగన్ కు వ్యతిరేకంగా అచ్చైన బ్యానర్ కథనాన్ని చూద్దాం. మోడీకి భయపడి జగన్ అన్నీవిధాలుగా సరెండర్ అయిపోయినట్లు రాశారు.




ఏమిలాభం నాయకా అనే హెడ్డింగ్ పెట్టి మరీ రాశారు. స్వార్ధం, కేసులభయంతోనే మోడీకి జగన్ సాగిలిపడ్డారన్నారు. మోడీకి ఎదురుతిరగాలంటేనే జగన్ భయపోడిపోతున్నట్లు చాలా చాలా చెప్పారు. సరే సీన్ కట్ చేస్తే రెండో కథనం ఏమిటంటే కేసీయార్ గురించి రాసింది. కేసీయార్ అష్టదిగ్గంధనం హెడ్డింగ్ తో అచ్చయిన కథనంలో మోడీతో యుద్ధం వల్ల తెలంగాణా రాష్ట్రం కూడా నష్టపోయే ప్రమాదం కనబడుతోందన్నారు.



మూడేళ్ళక్రితం మోడీకి వ్యతిరేకంగా కాలికిగజ్జె కట్టుకుని దేశమంతా తిరిగిన చంద్రబాబు ఎన్నికల్లో ఓడిపోయి చతికిలపడినట్లు ఇదే కథనంలో రాశారు. ఎన్నికల వరకు కూడా మోడీపై కాలుదువ్విన బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కూడా ఇపుడు అస్త్రసన్యాసం చేశారని మళ్ళీ ఎల్లోమీడియానే చెప్పింది. అంటే మోడీతో యుద్ధం చేయటంవల్ల నష్టమే తప్ప లాభంలేదని ఒకవైపు చెబుతునే జగన్ సరెండర్ అయిపోయినట్లు మరోవైపు రాసింది. అంటే జగన్ కు వ్యతిరేకంగా ఏమిరాయాలో కూడా ఎల్లోమీడియాకు అర్ధమవుతున్నట్లు లేదు.



మోడీకి వ్యతిరేకంగా యుద్ధంచేస్తే నష్టమని ఒకవైపు చెబుతునే మరోవైపు జగన్ సరెండర్ అయిపోయినట్లు రాయటం అంటే అర్ధమేంటి ? అయినా ఒకపుడు చంద్రబాబును ఇలాగే డైరెక్ట్ చేసి గబ్బుపట్టించినట్లే ఇపుడు జగన్ కూడా డ్రైవ్ చేద్దామని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లుంది. అయినా ఎల్లోమీడియా రాతలకు జగన్ రెచ్చిపోతారని ఎలా అనుకున్నారో అర్ధం కావటంలేదు. చంద్రబాబు అంటే జనాలను కాకుండా కేవలం ఎల్లోమీడియాను మాత్రమే నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళాడించినట్లు ఆడారు. కానీ జగన్ అలాకాదు గెలుపో ఓటమో డైరెక్టుగా జనాలనే నమ్ముకున్నారని మరచిపోయినట్లున్నారు.












మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: