ఉత్తరాంధ్ర : బాబాయ్ కే అబ్బాయ్ ఎర్త్ పెడుతున్నాడా ?

Vijaya






శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబునాయుడుకు తలనొప్పులు తప్పేట్లులేదు. ఎందుకంటే బాబాయ్ కింజరాపు అచ్చెన్నాయుడుకు అబ్బాయ్ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎర్త్ పెట్టాలని డిసైడ్ అయిపోయారట. ఇంతకీ ఎర్త్ పెట్టడం ఏమిటంటే  వచ్చే ఎన్నికల్లో రామ్మోహన్ ఎంఎల్ఏగా పోటీచేయాలని నిర్ణయించుకున్నారట. ఈ విషయం ఇటు అచ్చెన్నాయుడుతో పాటు అటు చంద్రబాబును బాగా ఇబ్బందులు పెడుతోంది.



రెండుసార్లు వరసగా శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన రామ్మోహన్ రేపటి ఎన్నికల్లో ఎంఎల్ఏగా పోటీచేస్తే రాజకీయ సమీకరణలన్నీ మారిపోతాయి. మారిపోతాయంటే టీడీపీపైన దెబ్బపడటం ఖాయం. ముందు ఎంపీగా పోటీచేసే నేతను వెతుక్కోవాలి. అలాగే రామ్మోహన్ కు నియోజకవర్గం చూడాలి. తర్వాత ఇద్దరు గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రిపదవి ఎవరికి ఇవ్వాలనే విషయంలో పెద్ద తలనొప్పి మొదలవుతుంది.




ప్రస్తుతం అచ్చెన్న టెక్కలినుండి పోటీచేస్తున్నారు. రామ్మోహన్ పక్కనే ఉన్న నరసన్నపేట నుండి పోటీలోకి దిగాలని డిసైడ్ అయ్యారట. పార్టీ అధికారంలోకి రాకపోయినా ఇద్దరు పోటీచేయటమే తలనొప్పని అనుకుంటే గెలిస్తే అదింకా పెద్ద తలనొప్పిగా మారటం ఖాయం. ఏ కారణంచేతనైనా పార్టీ అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలనే విషయంలో చంద్రబాబుకు సమస్య మొదలవుతుంది. ఇప్పటికే మంత్రిగా ఉన్న అచ్చెన్నను పక్కనపెట్టలేరు. అలాగని రామ్మోహన్నూ దూరంగా ఉంచలేరు. అబ్బాయ-బాబాయ్ బాగానే ఉంటారు కానీ మధ్యలో ఇరుక్కునేది చంద్రబాబే.



అబ్బాయ్-బాబాయ్ కుటుంబాల మధ్య పెద్దగా సఖ్యత లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు అబ్బాయ్ ఎంపీగా బాబాయ్ ఎంఎల్ఏగా ఉన్నారు కాబట్టి గొడవలు పెద్దదికాలేదు. అదే రేపు ఇద్దరు అసెంబ్లీకే పోటీచేస్తే మాత్రం పెద్ద సమస్యగా మారుతుంది. దీనిప్రభావం మిగిలిన నియోజకవర్గాల మీదకూడా పడుతుంది. ఇందుకనే రామ్మోహన్ను వచ్చే ఎన్నికల్లో కూడా ఎంపీగానే పోటీచేయమని చంద్రబాబు చెప్పారు. అయితే ఎంపీ అంగీకరించలేదట. కచ్చితంగా తాను ఎంఎల్ఏగా మాత్రమే పోటీచేస్తానని పట్టుపట్టారట. దీంతో ఏమిచేయాలో చంద్రబాబు, అచ్చెన్నకు దిక్కుతోచటంలేదట. కింజరాపు కుటుంబంలో మొదలైన చిచ్చు చివరకు ఎలా సద్దుమణుగుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: