మాస్కో : రష్యా దెబ్బకు అల్లాడిపోతున్నాయా ?

Vijaya





రష్యా-ఉక్రెయిన యుద్ధం కాదుకానీ యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలు అల్లాడిపోతున్నాయి. ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తున్న కారణంగా రష్యాపై ఈయూ దేశాలు ఏకపక్షంగా అనేక అంశాలపై బ్యాన్ విధించాయి. తమపై ఈయూ దేశాలు బ్యాన్ పెట్టడంతో ఒళ్ళు మండిపోయిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ వెంటనే ఆ దేశాలకు సహజ గ్యాస్, చమురు సరఫరాను నిలిపేసింది. కొన్నిదేశాలకు పూర్తిగాను కొన్నిదేశాలకు పాక్షికంగాను గ్యాస్, చమురు సరఫరా నిలిపేయటంతో ఆ దేశాలు నానా అవస్తలు పడుతున్నాయి.




గ్యాస్, చమురు పూర్తిగా రానిదేశాలేమో పుతిన్ను బండబూతులు తిట్టుకుంటున్నాయి. పాక్షికంగా ఆగిపోయిన దేశాలేమో పరిస్ధితులు సాధారణ స్ధాయికి రావాలని కోరుకుంటున్నాయి. ఏదేమైనా రష్యాపై విదించిన నిషేధాన్ని ఎత్తేసేమార్గాలను మాత్రం చూడటంలేదు. దాంతో రష్యా కూడా తన నిర్ణయాన్ని మరింత కఠినంగా అమలుచేయబోతోంది. రాబోయేది శీతాకాలం కావటంతో తమ జనాలకు ఏమి చెప్పుకోవాలో అర్ధంకాక ఈయూ దేశాలు నానా అవస్తలు పడుతున్నాయి.




ఇప్పటికే జర్మనీ, ఇటలీ, రుమేనియా, ఫ్రాన్స్, పోలండ్ లాంటి దేశాలు గ్యాస్, చమురు సరఫరా బాగా తగ్గిపోవటంతో నానా అవస్తలు పడుతున్నాయి. తమ జనాలను గ్యాస్, చమురు వాడకాన్ని తగ్గించుకోవాలని పదే పదే చెబుతున్నాయి. ఇపుడే ఇలాగుంటే రాబోయే శీతాకలంలో గ్యాస్ అందకపోతే చలిని ఎలా తట్టుకోవాలో జనాలకు, ప్రభుత్వాలకు అర్ధంకావటంలేదు. తాము రష్యాపై ఆంక్షలు విధిస్తే రష్యాకూడా తమను ఇబ్బంది పెడుతుందని ఈయూ దేశాలు ఆలోచించకపోవటమే విచిత్రంగా ఉంది.




ఆంక్షల కారణంగా ఇటు రష్యా అటు ఈయూ దేశాలు రెండూ రకరకాలుగా నష్టపోతున్నాయి. రెండింటిమధ్య సుదీర్ఘ యుద్ధం కారణంగా  ఉక్రెయిన్ నలిగిపోతోంది. మధ్యలో యుద్ధాన్ని విరమించమంటే రష్యా వినటంలేదు. అలాగని రష్యాకు లొంగిపొమ్మని ఉక్రెయిన్ కు చెప్పలేకపోతున్నాయి ఈయూ దేశాలు. ఎందుకంటే రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ను రెచ్చగొట్టిందే తామన్న విషయం ఈయూ దేశాలకు బాగా తెలుసు. ఇదే సమయంలో రష్యాతో సంధి చేసుకోవాలంటే ఈయూ దేశాలకు అహం అడ్డువస్తోంది. మొత్తానికి ఏదోరోజు ఈయూ దేశాలు రష్యాతో కాళ్ళబేరానికి రాకతప్పదేమో అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: