పీఎం కిసాన్ డబ్బులు వచ్చేస్తున్నాయి..ఆ రూల్స్ మారాయి..

Satvika
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలలో ఒకటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి..కేంద్ర ప్రభుత్వం ఏడాదిలో ప్రతి నాలుగు నెలలకోసారి రూ. 2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తున్న సంగతి తెలిసిందే. పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు వ్యవసాయ ఖర్చుల కోసం ఆర్థిక భరోసా కల్పిస్తోంది..ఇప్పటికే 11 విడతల డబ్బులను అందించింది.ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో 12వ విడత నగదు రానుంది. ఈ క్రమంలోనే పీఎం కిసాన్ స్కీమ్ రూల్స్ కూడా మారాయి. పీఎం కిసాన్ కొత్త నిబంధనలు ప్రకారం ఇప్పుడు రైతులు ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా మీ స్థితిని చెక్ చేయలేరు. కొత్త రూల్ ద్వారా రైతులు వారి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

కొత్త నిబంధనల ప్రకారం రైతులు డబ్బులు పొందాలనుకుంటే వారి మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ అవసరం. వీటి ద్వారా స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు పీఎం కిసాన్ పోర్టల్ కు లాగిన్ అయ్యి ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా నంబర్ ద్వారా నమోదు చేసేవారు. ఇక గతంలో మొబైల్ నంబర్ సౌకర్యం నిలిపివేశారు. ఆధార్, బ్యాంక్ నంబర్ ద్వారానే స్టేటస్ చెక్ చేయవచ్చు. కానీ ఇప్పుడు ఆధార్, బ్యాంక్ నంబర్ కాకుండా.. మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా మాత్రమే స్థితిని చెక్ చేసుకోవచ్చు.

స్టేటస్ ను ఎలా చెక్ చేసుకోవాలి..
ముందుగా పీఎం కిసాన్ వెబ్ సైట్ లాగిన్ కావాలి.
ఆ తర్వాత బెనిఫిషియరీ స్టేటస్‌పై క్లిక్ చేయండి.
తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
తర్వాత మీ స్థితి (స్టేటస్) తెలుస్తోంది.
మీ మొబైల్ నంబర్ ద్వారా స్థితిని తనిఖీ చేయాలనుకుంటే మొబైల్ నంబర్ సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత ఖాతాకు లింక్ చేసిన మొబైల్ నంబర్‌ని ఫిల్ చేయాలి.
ఆ తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి.
క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి డేటా పై క్లిక్ చేయాలి...
అంతే ఇంకేదైనా డౌట్స్ వుంటే దగ్గరలోని మీ సేవా కేంద్రాలకు వెళ్ళి సంప్రదించాలి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: