ITC: ఆ లోపం ఉన్నవారికి ఉద్యోగవకాశం?

Purushottham Vinay
సాధారణంగా దృష్టిలోపం ఉన్నవారికి కంటి చూపు అనేది మెరుగ్గా ఉండదు. కానీ వాసన పసిగట్టడంలో సాధారణ వ్యక్తుల కంటే కూడా వారు ముందుంటారు. ట్రైనింగ్ ఇస్తే ఈ రంగంలో వారు బాగా సత్తా చాటగలరు.అయినా కూడా ఈ రంగంలో సాధారణ వ్యక్తులతో పోల్చుకుంటే పాక్షిక దృష్టిలోపం ఉన్న వ్యక్తులు ఇంకా అంధులలో నియామక రేటు అనేది చాలా తక్కువగా ఉంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ కార్పొరేట్ కంపెనీ ఐటీసీ (ITC) ఓ గొప్ప నిర్ణయంని తీసుకుని అంధుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. తన కంపెనీలో సబ్బులు, సిగరెట్లు ఇంకా అలాగే మంగళదీప్ అగర్బత్తి వంటి ప్రొడక్ట్స్‌కు సంబంధించి ప్రత్యేకమైన సువాసనలను అంచనా వేయడానికి దృష్టిలోపం ఉన్న వారిని ఐటీసీ కంపెనీ జాయిన్ చేసుకుంటోంది. ఇక ఇప్పటి వరకు కూడా ఈ సంస్థ తన మంగళదీప్ సిక్స్త్ సెన్స్ (Mangaldeep Sixth Sense) ప్యానెల్ భాగంగా మొత్తం 60 మంది దృష్టిలోపం ఉన్న వారిని నియమించుకుంది.ఈ కంపెనీ కోల్‌కతా హెడ్‌క్వార్టర్స్ ఐటీసీ ద్వారా మొత్తం 60 మందిని ఉద్యోగాల్లో చేర్చుకుంది. అంతకుముందు వీరందరూ కూడా చిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు.


ఇక ఇప్పుడు ఒక ఐటీసీ కంపెనీలో చేరి తమ జీవితాలను మార్చుకోబోతున్నారు. భవిష్యత్తులో ఈ ప్యానెల్‌ ద్వారా కంపెనీ తన వ్యక్తిగత సంరక్షణ ఇంకా ఆహారం వంటి ఇతర రంగాల్లో కూడా పుట్టుకతోనే కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారిని ఎంపిక చేసుకోనుంది. "ఇక ఇంద్రియ సామర్థ్యాలను పెంచుకోవడంలో మేం వారికి శిక్షణ ఇస్తున్నాం. ఈ శిక్షణ సువాసన ఇంకా సుగంధ ద్రవ్యాల రంగంలో పనిచేసే మరిన్ని కన్జ్యూమర్ కంపెనీలకు వారి సేవలను అందించగలదని మేం ఆశిస్తున్నాం" అని సీనియర్ ITC ఎగ్జిక్యూటివ్ తెలిపారు. సువాసన ఇంకా అలాగే రుచుల ఆధారంగా కంపెనీలు మెరుగైన ఇంకా కొత్త ప్రొడక్ట్స్ తీసుకురావాలని కంపెనీలు బాగా ఆలోచిస్తున్నాయి. ఇక ఈ క్రమంలో చాలా రంగాలలో సువాసనలు అంచనా వేయడంలో శిక్షణ పొందిన వారికి డిమాండ్ అనేది చాలా బాగా పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ITC

సంబంధిత వార్తలు: