అమరావతి : మూడు పార్టీలు చేతులు కలిపాయా ?

Vijaya





వచ్చే ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసిపోటీచేస్తాయో లేదో ఇప్పుడే చెప్పలేము. అయితే ఈలోగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురదచల్లే విషయంలో మాత్రం బీజేపీ, టీడీపీ, జనసేన ఏకమైనట్లే ఉన్నాయి. ఎందుకంటే జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాల విషయంలో మూడుపార్టీలు ఒకే విధంగా నానా రచ్చ చేస్తున్నాయి. బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి, చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ మాట్లాడినా ఏపీ తొందరలోనే శ్రీలంక అయిపోతుందని గోల గోల చేస్తున్నారు.



నిజంగా ఈ ముగ్గురికి ఇంగితం అనేది ఉంటే ఇలాంటి ప్రకటనలు, ఆరోపణలు చేయరు. శ్రీలంకలో సంక్షోభం ముదిరిపోవటానికి కారణాలు వేరు. ఏపీలో పరిస్ధితులు వేరన్న కనీస పరిజ్ఞానం కూడా వీళ్ళకు లేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. శ్రీలంక అనేది ఒక దేశమైతే ఏపీ అనేది ఒక రాష్ట్రం మాత్రమే. శ్రీలంకలో ప్రభుత్వం తీసుకున్న అడ్డదిడ్డమైన నిర్ణయాలు, అవలంభించిన అస్తవ్యస్ధ విదానాల కారణంగానే ప్రస్తుత సంక్షోభం. ఆ పరిస్ధితి ఏపీలో తలెత్తే అవకాశంలేదు.



ఎందుకంటే శ్రీలంకలో విదేశీమారకద్రవ్యం నిల్వలు అయిపోవటం, ఎగుమతి, దిగుమతి పాలసీ తల్లకిందులైపోవటం, దేశ ఆదాయం పడిపోవటం, అధ్యక్షుడు, ప్రధానమంత్రి తదితరుల పనికిమాలిన నిర్ణయాల ఫలితంగానే దేశంలో  ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. కానీ ఏపీలో ఇలాంటి వాటికి అవకాశాలు లేవు. ఎందుకంటే శ్రీలంకలో నెలకొన్న పరిస్ధితులు మనదేశంలో కూడా తలెత్తాలంటే దానికి కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలి.




ఏపీలాంటి రాష్ట్రాలు దేశంలో 30 ఉన్నాయి. 30 రాష్ట్రాలూ అప్పుల్లోనే ఉన్నది వాస్తవం. అంతేకాదు కేంద్రప్రభుత్వం కూడా 135 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న విషయం చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ కు తెలీదా ? అన్నీ తెలిసే కావాలనే జగన్ ప్రభుత్వంపై బురదచల్లాలని ప్లాన్ చేశారు. అందుకనే ముగ్గురు కూడబలుక్కుని ఒకే మాటగా మాట్లాడుతున్నారు. వీళ్ళకు మద్దతుగా ఎలాగూ ఎల్లోమీడియా ఉంది కాబట్టే రెచ్చిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే విషయంలో ఎలాగున్నా ముందు జగన్ పై బురదచల్లటంలో మాత్రం మూడుపార్టీలు చేతులు కలిపినట్లే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: