తెలంగాణలో వింత..మళ్లీ చేపల వర్షం..

Satvika
దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.  ఈ వర్షాలకు వాగులు వంకలు పొర్లి పోతున్నాయి. దాంతో ఎక్కడ చూసినా చుట్టూ నీళ్లతో జలకల సంతరించుకుంది.అప్పుడప్పుడు వడగళ్లు పడటం సర్వ సాధారణం. కానీ, వీటికి భిన్నంగా వింతగా కొన్నిసార్లు చేపల వర్షం కూడా కురుస్తోంది.మబ్బుల్లో నుంచి చినుకుల్లా రాలి నేల మీద పడతాయి. ఈ వింత చాలా అరుదుగా జరుగుతుంటుంది. కానీ, ఈ మధ్య కాలంలో తెలంగాణలో తరుచుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్న కాళేశ్వరంలో చేపల వర్షం పడింది. ఇప్పుడు ఖమ్మం, జగిత్యాలలోనూ అదే సీన్ కనిపించింది.

అటు జగిత్యాలలోనూ వింత ఘటన జరిగింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల చేపల వాన కురిసింది. సాయినగర్ కాలనీలో వర్షంతో పాటు చేపలు నేల మీద పడ్డాయి. ఆ చేపలను చూసి స్థానికులు నివ్వెరపోయారు. అధిక బరువున్న చేపలను కొందరు తమ ఇళ్లకు తీసుకెళ్లారు..కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కరీంనగర్-జగిత్యాల బైపాస్ రోడ్డుపై వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో రాకపోకలకు ఆటంకం కలిగింది. అటు రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో పాటు చేపలు కొట్టుకొస్తున్నాయి. దీంతో చేపలు పట్టుకునేందుకు జనాలు తరలి వస్తున్నారు.

గత కొన్ని రోజులుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో తరుచూ ఈ వింత ఘటన చోటు చేసుకుంది. వర్షపు చినుకులతో పాటు చేపలు పడటం ఆశ్చర్యానికి గురి చేసింది. జులై 5న కాళేశ్వరంలో వర్షంతో పాటు ఆకాశం నుంచి చేపలు కూడా పడ్డాయి. ప్రాణంతో ఉన్న వాటిని కొందరు ఇళ్లకు తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనే జూన్ 20న కూడా చోటు చేసుకుంది. మహదేవ్ పూర్ మండలంలో అటవీ ప్రాంతంలో చేపల వర్షం కురిసింది. ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలకు చేపలు కనిపించడంతో వాటిని పట్టుకున్నారు...అయితే ఇవి చాలా నల్లగా ఉండి, చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: