రాయలసీమ : కుప్పంలో చంద్రబాబును కమ్ముకుంటున్నారా ?

Vijayaవచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబునాయుడును ఓడించటమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి+పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతున్నారు.  ఒకవైపు సంక్షేమపథకాల అమలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకోవైపు ఆకర్షణ పథకం..ఇలా అన్నీ విధాలుగా చంద్రబాబును నాలుగువైపులా పెద్దిరెడ్డి కమ్ముకుంటున్నారు. ఇందులో భాగంగానే ఎక్కడికక్కడ నియోజకవర్గంలోని టీడీపీ నేతలను లాగేసుకుంటున్నారు. తాజాగా గుడిపల్లె మండలంలోని సుమారు 100 మందికి పైగా కార్యకర్తలు టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అప్పుడప్పుడు టీడీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరిపోతున్నారు.వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబును ఓడించాల్సిందే అని జగన్ బలంగా డిసైడ్ అయ్యారు. సీఎం ఆలోచన ఎంతవరకు సాధ్యమవుతుందో తెలీదు కానీ ప్రయత్నాలు మాత్రం జరుగుతోంది. సర్పంచి ఎన్నికతో మొదలైన మున్సిపల్ ఎన్నికలవరకు మొత్తం స్ధానికసంస్ధల ఎన్నికలని వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రత్యేకంగా కుప్పంపైనే దృష్టిపెట్టారు. దీని ఫలితమే స్ధానిక ఎన్నికల్లో టీడీపీ ఘోరఓటమి.టీడీపీని ఘోరంగా ఓడించటం అంత తేలిగ్గా జరగలేదు. అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా నియోజకవర్గంలో అమలుచేస్తున్నారు. ఇళ్ళపట్టాలు, ఇళ్ళకేటాయింపులు, పెన్షన్లు, అమ్మఒడి లాంటి అనేక పథకాల అమలును పెద్దిరెడ్డి పక్కాగా అమలుచేయిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో పోటీచేస్తు చనిపోయిన చంద్రమౌళి కొడుకు భరత్ కే జగన్ ఎంఎల్సీ పదవిని ఇచ్చారు.నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీలు చాలా ఎక్కువ. వీళ్ళే కాకుండా మిగిలిన సామాజికవర్గాలకు కూడా జగన్ బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సామాజికవర్గాల సమతూకం పాటిస్తున్నట్లయ్యింది. పెద్దిరెడ్డి, కొడుకు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో పాటు భరత్ కూడా రెగ్యులర్ గా నియోజకవర్గంలో తిరుగుతునే ఉన్నారు. ఇవే కాకుండా లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ను కూడా జగన్ పరిష్కరిస్తున్నారు. దీంతో జనాలు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎన్నికల్లోపు మరింతమంది టీడీపీ నేతలను వైసీపీలోకి లాగేయాలన్న టార్గెట్ పెట్టుకుని పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నారు. చూడబోతే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు పనిచేసేందుకు నేతలు కరువైనా ఆశ్చర్యపోవక్కర్లేదన్నట్లుగా ఉంది వ్యవహారం. మరి జగన్, పెద్దిరెడ్డి ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: