కుప్పంలో చంద్రబాబు మీద పోటీగా బరిలోకి హీరో విశాల్ ?

VAMSI
ఏపీలో ప్రస్తుతం రాజకీయాలు మంచి హీటు మీద ఉన్నాయి. ఇప్పటి నుండే రాబోయే ఎన్నికల కోసం అధికార ప్రతిపక్షాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన మరియు బీజేపీ లు వైసీపీని గద్దె దించడానికి తెరవెనుక పలు రాజకీయాలు చేస్తున్నాయి. అయితే వైసీపీ మాత్రం ప్రజల మీదనే నమ్మకం పెట్టుకుంది ..తాము చేసిన అభివృద్ధి సంక్షేమమే మమ్మల్ని గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే... టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంతకాలం వరకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన నియోజకవర్గం పై ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ గా మారింది. చంద్రబాబు కుప్పం నుండి ఎప్పటి నుండో పోటీ చేస్తూ గెలుస్తూ వస్తున్నాడు.
అయితే గత ఎన్నికలలో మాత్రం అతి స్వల్ప మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించి ఓటమి నుండి గట్టెక్కారు. దీనితో చంద్రబాబు పని అయిపోయింది అని అంతా డిసైడ్ అయిపోయారు. అయినా ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. అయితే ఇప్పుడు వరుసగా కుప్పంలో పర్యటిస్తూ ఇంకా బలాన్ని కూడగట్టుకునే పనిలో పడ్డాడు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికలలో కుప్పం నుండి వైసీపీ అభ్యర్థిగా తమిళ హీరో విశాల్ పోటీ చేయనున్నాడు అని వార్తలు వస్తున్నాయి. సినిమాలతో ప్రేక్షకులకు దగ్గర కావడం మరియు సమాజ సేవతో చాలా మందికి దగ్గరవడం వంటివి ఇతనికి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది ఇంకా తెలియలేదు.  ఒకవేళ ఇది నిజమే అయితే వైసీపీ ప్లాన్ సరైనదేనా ? అంత రాజకీయ అనుభవం ఉన్న బాబు మీద పోటీగా అస్సలు రాజకీయ అనుభవం లేని... విశాల్ ను బరిలోకి దింపే సమంజసమేనా ? అన్న పలు విషయాలకు సమాధానం దొరకాలంటే కొంత కాలం వెయిట్ చేయక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: