ఉత్తరాంధ్ర : చంద్రబాబు కారుకింద క్లెమోర్ మైన్ పేల్చిందెవరు ?

Vijaya



ఈమధ్య ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు మాటలు చాలావరకు విచిత్రంగా ఉంటున్నాయి. జరిగినదానికి ఆయన మాట్లాడే మాటలకు ఏమాత్రం పొంతన ఉండటంలేదు. ఉత్తరాంధ్రపర్యలనలో ఉన్న చంద్రబాబు మాట్లాడుతు తనపై వెంకటేశ్వరస్వామి 24 క్లెమోర్ మైన్స్ పేల్చినా తనకేమీ కాలేదని చెప్పారు. వెంకటేశ్వరస్వామి ఏమిటి చంద్రబాబుపై క్లెమోర్ మైన్స్ పేల్చటం ఏమిటి ? అన్నది జనాలకు అర్ధంకాలేదు.



2003లో శ్రీవారి దర్శనం కోసం చంద్రబాబు తిరుమలకు వెళుతున్నపుడు అలిపిరి టోల్ గేట్ దాటగానే క్లమోర్ మైన్ ఒకటి పేలింది. చంద్రబాబును హత్యచేయటమే టార్గెట్ గా అప్పట్లో మావోయిస్టులు క్లెమోర్ మైన్స్ అమర్చారు. అయితే వాటిల్లో ఒకటిమాత్రమే పేలింది. అదికూడా చంద్రబాబు ప్రయాణిస్తున్న కారుకింద పేలింది. చంద్రబాబు ముందుసీటులో కూర్చుంటారు కాబట్టి ఆయన సీటుకింద మైన్ పేలాలని మావోయిస్టులు ప్రయత్నించారు. నిజంగా చంద్రబాబు అదృష్టంబాగుంది కాబట్టే కేవలం ఒక్కటి మాత్రమే పేలింది



అయితే రెండు సెకన్లు ఆలస్యం అవటంతో  మైన్ పైన కారు వెనుకసీటు వచ్చినపుడు పేలింది. ముందు సీటులో కూర్చున్న చంద్రబాబు అయినా వెనుకసీటులో కూర్చున్న ఎంఎల్ఏలైనా ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. వాస్తవం ఇదైతే ఇపుడేమో వెంకటేశ్వరస్వామే తనపై క్లెమోర్ మైన్లు పేల్చినట్లు రోడ్డుషోలో చెప్పారు. అంటే తాను ఏమి మాట్లాడుతున్నారో కూడా చంద్రబాబుకు తెలియటంలేదని అర్ధమైపోతోంది.



అప్పుడెప్పుడో పేలిన క్లెమోర్ మైన్ అంశం ఇపుడు ప్రస్తావన కూడా అవసరంలేదు. పైగా ఎక్కడా మాట్లాడుతున్నా తనపైన ఎంతోమంది బాంబులు వేసినా తాను భయపడలేదని చెబుతుంటారు. చంద్రబాబుపైన ఇప్పటివరకు ఎవరూ బాంబులు వేయలేదు. బాంబుదాడుల నుండి చంద్రబాబు ఎప్పుడూ తప్పించుకోలేదన్నది వాస్తవం. అంటే తన విషయంలో జరగనిది జరిగిపోయినట్లు చంద్రబాబు ఎందుకు భ్రమపడుతున్నారో అర్ధం కావటంలేదు. తనమీద బాంబులు వేస్తేనే భయపడలేదు ఇక జగన్మోహన్ రెడ్డికి భయపడతానా తమ్ముళ్ళూ ? అంటూ దీర్ఘాలు తీస్తుంటారు. బాంబులు పడటానికి జగన్ కు భయపడటానికి ఏమి సంబంధమో ఎవరికీ అర్ధం కావటంలేదు. హెమిటో చంద్రబాబు చివరకు ఇలాగైపోతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: