భారీగా తగ్గిన వంటనూనె ధరలు... కొత్త ధరలు అమలు ఎప్పుడంటే ?

VAMSI
ఈ మధ్య కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతూ సామాన్యులకు చుక్కలు చూపెడుతున్నాయి. అయితే ఇదే తరహాలో వంట నూనె ధరలు కూడా బాగా వేడెక్కాయి. అందులోనూ రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంతో వంటనూనె ధరలు భారీగా పెరిగాయి, దాంతో వంట నూనెలు అంటే బంగారాన్ని కరిగించి చేస్తున్నారేమో అనేలా రేట్లు చుక్కలు చూపించాయి. సామాన్యులు అయితే పెరిగిన నూనె ధరలతో నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లీటరు 100 రూపాయలు కంటే తక్కువగా ఉన్న కొన్ని నూనె ధరలు సైతం ఏకంగా రూ.250 మార్క్ ను దాటడంతో అంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కాగ ఈ మధ్య ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం సర్దుమణుగుతున్న నేపథ్యం లో నూనె ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. ఆ మధ్య కాస్త వంట నూనె ధరలు కాస్త తగ్గగా ఇపుడు మరో సారి నూనెల ధరలు తగ్గుముఖం పట్టాయి. దాంతో సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  గత కొన్నాళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మద్య జరిగిన భీకర యుద్ధ ప్రభావం ఇపుడు తగ్గడంతో  వంటనూనె ధరలు కూడా మెల్లగా దిగొస్తున్నాయి. వంటనూనె ధరలను రూ.10 నుంచి రూ.30 వరకు ఆయిల్ కంపెనీలు తగ్గిస్తూ గొప్ప నిర్ణయం తీసుకున్నాయి సదరు కంపెనీలు. గత వారం అంతర్జాతీయంగా వంటనూనె ధరలు 6 నుంచి 11 శాతం తగ్గడం చెతా.. వంటనూనె ధరలను కూడా కంపెనీలు తగ్గించాయి అని తెలుస్తోంది.
అయితే ధరలు తగ్గించిన కొత్త ప్యాక్ లు అందుబాటులోకి వచ్చేందుకు ఇంకో పది పదిహేను రోజుల సమయం పట్టే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కాగా ప్రస్తుతం ఉన్న నిల్వలు పూర్తయ్యే వరకు కూడా పాత రేటుకే నూనె ను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఏదేమైనా నూనె ధరలు తగ్గడం తో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: