కేసీఆర్‌ నమ్మకాలపై మోదీ ఎటకారం..?

Chakravarthi Kalyan
ప్రధాని నరేంద్ర మోదీ.. కేసీఆర్‌ సెంటిమెంట్లను ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ పేరు ప్రస్తావించకుండానే.. కేసీఆర్‌ సెంటిమెంట్లపైనా విమర్శలు చేశారు. తెలంగాణలో కొందరు మూఢనమ్మకాలకు బానిసలుగా మారారని మోదీ కేసీఆర్‌ను ఉద్దేశించి ఆరోపించారు. కేసీఆర్‌ సచివాలయానికి వెళ్లడం లేదని అర్థం వచ్చేలా మోదీ వ్యాఖ్యలు చేశారు. ఆధునిక, సాంకేతిక కాలంలోనూ ఎక్కడికైనా వెళ్తే అధికారం పోతుందని కొందరు విశ్వసిస్తున్నారని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ మూఢ విశ్వాసాల్ని పారదోలి తెలంగాణను టెక్నాలజీ హబ్‌గా మారుస్తామని ప్రధాని మోదీ అన్నారు.

ప్రస్తుత 21వ శతాబ్దంలోనూ కొందరు మూఢనమ్మకాలకు బానిసలుగా మారారని సెటైర్లు వేశారు. వీరు తమ మూఢవిశ్వాసలతో ఎవరినైనా నాశనం చేస్తారని.. ఈ మూఢవిశ్వాసం ఉన్న వ్యక్తులు  తెలంగాణ సమర్థతకు.. ఎప్పటికీ న్యాయం చేయలేరని ప్రధాని కామెంట్ చేశారు.  తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ఒక పట్టణానికి వెళ్లొద్దనే ప్రచారం ఉండేదని... ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లారంటే అధికారం పోతుందని నమ్మేవారని.. కానీ నేను అక్కడికి పదేపదే వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి మూడనమ్మకాలు కలిగిన వ్యక్తి నుంచి మన తెలంగాణను మనం రక్షించుకోవాలని ప్రధాని విమర్శించారు.  

అధికారంలోకి వచ్చిన ఒక కుటుంబం నేతృత్వంలోని పార్టీ సభ్యులు ఎలా అవినీతిలో కూరుకుపోయారో తెలంగాణ ప్రజలు చూస్తున్నారన్న ప్రధాని నరేంద్ర మోదీ.. కుటుంబపార్టీలకు పేదల బాధలు, పేదల సమస్యల పట్ల ఎలాంటి చింత ఉండదని అన్నారు. ఒక కుటుంబం ఎలాగైనా అధికార పీఠాన్ని కబ్జా చేసి ఎంత కావాలనుకుంటే అంత దోచుకోవటంపైనే దృష్టంతా కేంద్రీకృతమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఇందుకోసం వారు సమాజాన్ని విడదీసేందుకూ కుట్రలు చేస్తారని.. ప్రధాని విమర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలను వేధిస్తోందని ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనలో ఆరోపించారు. అయితే బీజేపీ కార్యకర్తలు తగ్గేవాళ్లు కాదని, నెగ్గేవాళ్లని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. మొత్తానికి ప్రధాని నరేంద్ర మోదీ తన పాత పర్యటనలకు భిన్నంగా హైదరాబాద్‌ పర్యటనలో కేసీఆర్‌ పై బాగానే విమర్శలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: