అమలాపురం అల్లర్లపై మంత్రి రోజా సీరియస్ కామెంట్స్..

Deekshitha Reddy
అమలాపురం అల్లర్లపై మంత్రి రోజా ప్రతిపక్షాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతిపక్షాలే ఈ అల్లర్లకు కారణం అని అన్నారామె. గతంలో అందరూ అంబేద్కర్ పేరుకి మద్దతిచ్చారని, కానీ ఇప్పుడిలా మెలిక పెడుతున్నారని మండిపడ్డారు. అల్లర్లు చేయడం సరైన విధానం కాదని, విధ్వంసాలు సృష్టిస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు రోజా.
కోనసీమ జిల్లా పేరు మార్పు వ్యవహారంలో ప్రతిపక్షాల తీరుని తప్పుబట్టారు మంత్రి రోజా. ప్రతిపక్షాలు ద్వంద్వ వైఖరితో ఉన్నాయని ఆమె మండిపడ్డారు. అమలారుపంలో శాంతి భద్రతల స్థాపనకు పోలీసులు కృషి చేస్తున్నారని, వారి సేవలు అభినందనీయం అని అన్నారు రోజా.
ప్రస్తుతం కోనసీమ జిల్లాలో పరిస్థితి అదుపులో ఉంది. అమలాపురంలో మంగళవారం అల్లర్లుల జరుగగా, బుధవారం రావులపాలెంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దశలో అమలాపురంలో కూడా అల్లర్లను అదుపులోకి తీసుకోడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ముందుగానే అక్కడ షాపులన్నీ మూసివేయించారు. వ్యారాల వర్గాలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. అల్లరి మూకలు రోడ్లపైకి రాకుండా నిరోధించారు. మరోవైపు ఇతర ప్రాంతాలవారిని అమలాపురం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుున్నారు. మరో రెండు రోజుల్లోగా కోనసీమలో పూర్తిగా పరిస్థితి అదుపులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. అటు ముందు జాగ్రత్తగా కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా అల్లర్లకు పాల్పడినవారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
అటు అమలాపురం ఉద్రిక్తతలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కోనసీమ జిల్లాకు పునర్విభజన సమయంలోనే కొత్త పేరు పెడితే బాగుండేదని, ఇప్పుడు పేరు మార్చి అందులోనూ 30రోజుల నోటీస్ పీరియడ్ ఇవ్వడం వల్లే గొడవలు మొదలయ్యాయని జనసేనాని పవన్ కల్యాణ్ కూడా విమర్శించారు. అధికార పార్టీ నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు. మంత్రి రోజా సహా ఇతర మంత్రులు ప్రతిపక్షాల తీరుని తప్పుబట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: