పాటియాలా : పాపం సిద్ధూకి ఎంతకష్టం వచ్చింది ?

Vijaya



పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు నవ్ జోత్ సింగ్ సిద్ధూ పాటియాల జైలులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడెప్పుడో అంటే సుమారు 30 ఏళ్ళక్రితం పాటియాలలోని నడిరోడ్డులో గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి కారుకు సిద్ధూ తన కారును అడ్డంగా నిలిపారు. అడ్డంగా పెట్టిన కారును తీయమని గుర్నామ్ ఒకటికి రెండుసార్లు చెప్పినా సిద్ధూ వినిపించుకోలేదు. దాంతో ఇద్దరిమధ్యా గొడవ మొదలై చివరకు మాటమాట పెరిగిపోయింది.



సిద్ధూతో పోల్చితే అప్పట్లో  గుర్నామ్ సింగ్ అనామకుడనే చెప్పాలి. ఎందుకంటే సిద్ధూ అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న క్రికెటర్. ఇండియన్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్. సిక్సర్ల సిద్ధూగా మంచి క్రేజున్న క్రికేటర్. అలాంటి సిద్ధూకి గుర్నామ్ మీద కోపం ముంచుకొచ్చి గట్టిగా కొట్టాడు. సిద్ధూ కొట్టిన దెబ్బలకు గుర్నామ్ చనిపోయాడు. దీనిమీద కోర్టుల్లో విచారణలు జరగటం, ఒక కోర్టు కొట్టేస్తే మరో కోర్టుకు రివ్యూ పిటీషన్ వేయటం ఇలా సాగి సాగి చివరకు ఈమధ్యనే సిద్ధూకి ఏడాది జైలుశిక్ష పడింది.



సరే సిద్ధూని పోలీసులు పాటియాలలోని సెంట్రల్ జైలు 10వ బ్యారక్ లోని ఒక సెల్లో ఉంచారు. నిజానికి సిద్ధూకి కష్టం ఏడాది శిక్ష కాదు. పాటియాలలోని సెంట్రల్ జైలు సెల్లో మొదలైందనే చెప్పాలి. ఇద్దరు ఖైదీలుండే సెల్లో సిద్ధూని కూడా ఉంచారు. అంతకుముందు ఆ సెల్లో మరో ఖైదీకూడా ఉన్నాడు. ఆ ఖైదీరూపంలోనే సిద్ధూకి అసలైన కష్టమొచ్చిపడింది. ఇంతకీ విషయం ఏమింటటే రెండో ఖైదీ ఎవరంటే అకాలీదళ్ పార్టీ ముఖ్యనేతల్లో ఒకడైన బిక్రమ్ సింగ్ మాఝితీయ.



ఈయనను డ్రగ్స్ రవాణా కేసులో పోలీసులు అరెస్టుచేసి జైలులో ఉంచారు. చాలా సంవత్సరాలుగా మాఝితీయ-సిద్ధూ మధ్య సంబంధం  ఉప్పు నిప్పులాంటిది. ఇద్దరూ విపరీతమైన ఆవేశపరులే.  వీళ్ళద్దరు బయటుంటే ముఖ్యంగా మొన్నటి ఎన్నికల్లో ఒకళ్ళకి మరొకళ్ళు ఎదురుపడినపుడు ఒకళ్ళపై మరొకరు దాడిచేసుకున్నంత పనైందట. అలాంటి ఉప్పు-నిప్పులాంటి నేతలిద్దరు ఇపుడు ఒకే సెల్లో శిక్షను అనుభవించాల్సొచ్చింది. మరి శిక్షాకాలం పూర్తయ్యేంతలోపు ఎవరికేమవుతుందో చూడాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: