మెగా ఫ్యాన్స్ కు "జగన్" ను గద్దె దించే దమ్ముందా?

VAMSI
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి మద్దతుగా నిలుస్తూ అధికార పార్టీని గద్దె దింపి , పవన్ ను గద్దె ఎక్కేలా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు మెగా అభిమానులు. మరి జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయి. పవన్ ను సీఎం చేయడమే లక్ష్యంగా మెగా అభిమానులు అంతా కలిసి పని చేయాలని చిరంజీవి అభిమానుల సంఘం పేర్కొనడం గమనార్హం . నిన్న విజయవాడలో జరిగిన మెగా అభిమానుల సమావేశం కు ఇదే ముఖ్య కారణం. ఈ సమావేశంలో మెగా అభిమానులు చర్చించిన కొన్ని పాయింట్స్ విషయానికి వస్తే... వచ్చే ఎన్నికల కోసం ప్రణాళిక మొదటి అంశం.
ఇందులో అధికార పార్టీని గద్దె దింపి పవన్ కు పట్టం కట్టడమే. పవన్ అన్న పథకాల గురించి ఆయన అజెండాలోని అభివృద్ధి ని ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటివి.
   
అయితే ఈ సమావేశంలో  చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ లు రాక పోయినా వారి ఫ్లెక్సీ లను భారీగా ఏర్పాటు చేసిన మెగా అభిమానులు అదే కుటుంబం లోని స్టార్ హీరో అల్లు అర్జున్ ని మరిచిపోవడం గమనార్హం.  బన్నీ ఫోటో కానీ, అతని తండ్రి అరవింద్ ఫోటో కానీ ఎక్కడా వేయలేదు. దీంతో సమావేశం ముఖ్య కారణం అటుంచితే... కొత్త చర్చలు తలెత్తుత్తాయి. అల్లు అర్జున్ ని దూరం పెడితే మెగా ఫాన్స్ లో చీలిక వచ్చే ప్రమాదం ఉందని ఉంది. ఇది చాలా కీలకంగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  ఎందుకంటే మెగా అభిమానులు అంటే మెగా ఫ్యామిలీ లోని హీరోలందరి ఫ్యాన్స్ కలిపి ఒక  తాటి లోకి వస్తారు. అయితే ఇలా అల్లు అర్జున్ ని పక్కన పెడితే ఆ వ్యతిరేకత ఎన్నికలపై పడే ప్రమాదం ఉంది.
అదికాస్తా వైఎస్ జగన్ కు ఉపయోగకరంగా మారే అవకాశం కూడా లేకపోలేదు. తమ అభిమాన హీరోని పక్కనే పెట్టారనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వానికి మద్దతు పలికే అవకాశం కూడా ఉంది. అయినా బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా. ఆ సైన్యం చాలా పెద్దది,  మెగా హీరోల్లో చిరు, పవన్ తరవాత అంతటి భారీ అభిమానుల ను సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. మరి తదుపరి సమావేశాల్లో అయినా ఈ విషయం పై అలెర్ట్ అవుతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: