అమరావతి : చినబాబుకు ఒక్క నియోజకవర్గమూ లేదా ?

Vijaya



అదేమిటో చినబాబు నారా లోకేష్ గెలుపు గ్యారెంటీ ఇచ్చే అసెంబ్లీ నియోజకవర్గం ఒక్కటి కూడా లేదట. కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న లోకేష్ కు ఇప్పటివరకు సొంత నియోజకవర్గం అన్నదే లేకపోవటం నిజంగా దుదరదృష్టమే. పార్టీలో జూనియర్ మోస్ట్ ఎంఎల్ఏలకు, నేతలకు కూడా కచ్చితంగా ఒక నియోజకవర్గం అనేది ఉంటుంది. అదేమిటో లోకేష్ కు మాత్రం కనీసం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గం కూడా లేకపోవటమే ఆయన కెపాసిటికి నిదర్శనంగా మారింది.



2019 ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీచేసిన లోకేష్ ఓడిపోయారు. లోకేష్ గెలుపుకు సేఫెస్ట్ నియోజకవర్గం ఏదనే విషయంలో పెద్ద కసరత్తు చేసి మరీ మంగళగిరిని ఎంపికచేశారు చంద్రబాబు. అలా ఎంపిక చేసిన నియోజకవర్గంలోనే లోకేష్ ఓడిపోయారు. అప్పటినుండి ఒక నియోజకవర్గం అన్నదే లేకుండాపోయింది. ఆమధ్య చంద్రబాబునాయుడు చేసిన నిరాహారదీక్షలో లోకేష్ మాట్లాడుతు మంగళగిరిలో గెలుస్తానని ప్రతిజ్ఞచేశారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో రెండోసారి లోకేష్ మంగళగిరిలో పోటీచేయటం ఖాయమని అనుకున్నారు.




కానీ ఇపుడు మరో రెండు నియోజకవర్గాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అవేమిటంటే అనంతపురం జిల్లాలోని హిందుపురం నియోజకవర్గం. అలాగే శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నియోజకవర్గం. హిందుపురం నియోజకవకర్గం టీడీపీకి కంచుకోటనే చెప్పాలి. ఎలాగంటే పార్టీ పెట్టినదగ్గర నుండి ఇప్పటివరకు టీడీపీ ఒక్కసారి కూడా ఓడలేదు. అందుకనే నందమూరి బాలకృష్ణ ఇక్కడినుండి రెండుసార్లు గెలిచారు. లోకేష్ కన్ను ఈ నియోజకవర్గంమీద పడిందంటే బాలకృష్ణ ఖాళీ చేయాల్సిందేనా ? అనే చర్చ మొదలైంది.




ఇక ఇచ్ఛాపురంలో కూడా టీడీపీ స్ట్రాంగ్ గానే ఉంది. అప్పుడప్పుడు ఓడుతున్నా ఓవరాల్ గా బలంగానే ఉందనిచెప్పాలి. ఇపుడు ఇక్కడనుండి బెందాళం అశోక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అశోక్ కాకుండా లోకేష్ పోటీచేస్తారనే ప్రచారం మొదలైంది. అందుకనే లోకేష్ ఇచ్చాపురం నేతలతో టచ్ లో ఉంటున్నారని సమాచారం. రెండేళ్ళల్లో లోకేష్ కోసం ఇంకెన్ని నియోజకవర్గాలు తెరపైకి వస్తాయో తెలీదు. మొత్తానికి లోకేష్ కంటు సొంత నియోజకవర్గం లేదని అర్ధమైపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: