హవ్వ.. ఆయనకు రాజ్యసభ సీటా అంటున్న జగ్గారెడ్డి

Chakravarthi Kalyan
టీఆర్ఎస్‌ రాజ్యసభ సీట్లను అమ్ముకుందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారధి రెడ్డికి టీఆర్ఎస్‌ రాజ్యసభ సీటు ఇవ్వడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి మండిపడ్డారు. పార్థసారధిరెడ్డి ఇంటిపై దాడులు చేస్తే ఐటీ రైడ్స్ లో ఐదు వందల కోట్లు దొరికాయని.. అలాంటి వ్యక్తిని రాజ్యసభకి ఎందుకు పంపారు అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు.

నన్ను ఒకడు తెలంగాణ ద్రోహి అన్నాడు.. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రాజ్యసభ సీట్లు ఇవ్వచ్చు కదా  ఎందుకు ఇవ్వలేదు.. ప్రజలు కూడా ఆలోచన చేయాలి.. తెలంగాణలో ప్రజా పరిపాలన కాదు..బిజినెస్ పాలన నడుస్తుంది.. తెరాస  రాజ్యసభ సభ్యుల ఎంపిక లో విలువలు పోగొట్టింది... హెటిరో పార్థసారధిని రాజ్యసభకు ఎందుకు ఎంపిక చేశారు అనేది ప్రశ్నార్ధకం.. ఐదు వందల కోట్లు ఎలా వచ్చాయి.. కరోనా సమయంలో రేమిడిసివర్ తయారు చేసిన కంపెనీలో ఐదు వందల కోట్లు దొరికాయి.. కనపడని వేల కోట్లు ఉన్నాయి.. అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి విమర్శించారు.
 
కాంగ్రెస్ ను ఎన్నికల్లో ఓడగొట్టడం కోసం వేల కోట్ల ఉన్న పార్థడాసారధికి రాజ్యసభ సీటు ఇచ్చారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి విమర్శించారు. ప్రజల రక్తాన్ని పీల్చి..సొమ్ములు దాచుకున్న వ్యక్తికి రాజ్యసభ సీటు ఇస్తారా.. ఇంత అన్యాయం.. ఇంత దుర్మార్గమా.. అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి మండిపడ్డారు. పార్థ సారథి వెనక పెద్ద కుంభకోణం ఉందని.. అయన దగ్గర వేల కోట్లు దాచి పెట్టి ఉంటాడని.. ప్రోటోకాల్, సెక్యూరిటీ కోసం రాజ్యసభ ఇచ్చాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ డబ్బులు అన్నీ పార్థ సారది దగ్గరే ఉన్నాయని.. అందుకే ఆయన్ను రాజ్యసభకు పంపారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి విమర్శించారు. కరోనాతో అన్ని వ్యాపారాలు బంద్ అయ్యాయని.. కేవలం మెడిసిన్, లిక్కర్ వ్యాపారుల దగ్గరే డబ్బు ఉందని.. ఫార్మా అధినేతల దగ్గర కుప్పల కుప్పల డబ్బులు ఉన్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: