హైదరాబాద్ : చంద్రబాబుకు పవన్ పెద్ద షాక్

Vijayaజనసేన అధినేత పవన్ కల్యాణ్ ను నమ్ముకుంటే పుట్టిముణిగిపోవటం ఖాయమేనా ? అవుననేందుకు తాజాగా సంకేతాలు కనిపించాయి. నిలకడలేని, అపరిపక్వత రాజకీయాలకు పవన్ పెట్టిందిపేరు. విషయ పరిజ్ఞానం లేకుండా రాజకీయాలు ఎవరైనా చేస్తున్నారంటే ముందు పవన్ పేరు ఉదాహరణగా చెప్పుకోవాలి. ఇలాంటివాటికి తాజా ఉదాహరణగా పవన్ తెలంగాణా టూర్ వేదికైంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరణించిన జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు పవన్ యాదాద్రిలో పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో పవన్ మాట్లాడుతు మూడు విషయాల్లో పొంతనలేని సమాధానాలిచ్చారు. మొదటిదేమో వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమట. రెండేదోమే వచ్చే ఎన్నికల్లో తెలంగాణా పోటీచేస్తుందట. మూడోదేమో ఏపీలోనే అధికారాన్ని ఆశించని తాను తెలంగాణాలో ఏమాశిస్తాను అని ఎదురు ప్రశ్నించారు. మొన్నేమో ఏపీలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఈరోజేమో ఇలా మాట్లాడారు. అంటే ఏపీ విషయంలో పవన్ చేతులెత్తేసినట్లే అర్ధమవుతోంది. 
ఇక వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని చెప్పటమే అన్నింటికన్నా విచిత్రంగా ఉంది. ఒకవైపు ఏపీలో చంద్రబాబునాయుడుతో పొత్తులకు రెడీ అయిపోతు మరోవైపు వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పటమేంటో అర్ధం కావటంలేదు. తాజా ప్రకటన ప్రకారం చూస్తే ఏపీలో చంద్రబాబుతో పొత్తు ఉండదేమో అనే అనుమానం వస్తోంది. బహుశా చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకుండా పవన్ను బీజేపీ ఏమైనా ఓవర్ పవర్ చేసిందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి.
చివరగా తెలంగాణా ఎన్నికల్లో జనసేన పోటీచేస్తుందని చెప్పారు. అయితే ఎన్నిస్ధానాల్లో పోటీచేస్తుందనే విషయంలో కచ్చితంగా పరిమితమైన స్ధాయిలోనే పోటీ ఉంటుందన్నారు. 20 శాతం  సీట్లలో పోటీచేయాలా ? లేకపోతే మూడోవంతు సీట్లలో పోటీచేయాలా అనే విషయం తొందరలోనే డిసైడ్ చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలోను జనసేనకు 5 వేలకు తగ్గకుండా ఓట్లున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన కీలకమైన పాత్రయితే పోషిస్తుందని చెప్పిన పవన్ పొత్తుల గురించి మాత్రం ఏమీ చెప్పలేదు. టీఆర్ఎస్-కాంగ్రెస్-బీజేపీ మధ్య ఎలాంటి పాత్ర పోషించాలో ఆలోచించుకోవాలని చెప్పటం కాస్త విచిత్రంగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: