అమరావతి : 26 నుండి జయహో జగనన్న యాత్ర ?

Vijaya



జగన్మోహన్ రెడ్డి హఠాత్తుగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను, జరుగుతున్న అభివృద్ధిని, పాటిస్తున్న సామాజికన్యాయాన్ని జనాలకు డైరెక్టుగా వివరించాలని జగన్ తో జరిగిన మీటింగ్ లో డిసైడ్ అయ్యింది.  ఇందుకోసం నాలుగురోజుల పాటు బస్సులో యాత్ర చేయాలని అందులో పై సామాజికవర్గాలకు చెందిన 17 మంది మంత్రులు, ఎంపీలు, ఎంఎల్ఏలతో పాటు సీనియర్ నేతలు కూడా ఉండాలని జగన్ ఆదేశించారు.



ఇప్పటికే గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమం జరుగుతోంది. అదనంగా కొన్ని జిల్లాల్లో బహిరంగసభలో జగన్ పాల్గొంటున్నారు. దీనికి అదనంగా ఈనెల 26 నుండి పట్టణాలు, మండలకేంద్రాలన్ టచ్ చేస్తు బస్సుయాత్రలు.  26న శ్రీకాకుళంలో కానీ లేదా విజయనగరంలో కానీ బహిరంగసభతో యాత్ర మొదలవ్వబోతోంది. అదేరోజు రాత్రి విశాఖపట్నంలో బసచేసి మరుసటి రోజు అంటే 27న రాజమండ్రిలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. ఆరాత్రి తాడేపల్లిగూడెంకు చేరుకుని అక్కడే బసచేస్తారు. మర్నాడు అంటే 28వ తేదీన పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో బహిరంగసభ జరుగుతుంది.



బహిరంగసభ అయిపోగానే రాత్రికి నంద్యాలలో రెస్ట్ తీసుకుంటారు. మరుసటి రోజు 29న అనతపురంలో బహిరంగసభలో పాల్గొంటారు. దీంతో నాలుగు చోట్ల బస్సుయాత్రలు, నాలుగుచోట్ల బహిరంగసభలు నిర్వహించినట్లవుతుంది. రాజ్యసభకు నలుగురు అభ్యర్ధులను ఖరారుచేసిన మరుసటి రోజే బస్సుయాత్రకు జగన్ డిసైడ్ అవ్వటం గమనార్హం. జగన్ ప్లానింగ్ చూస్తుంటే చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా చెబుతున్నట్లు ముందస్తు ఎన్నికలకు వెళ్ళబోతున్నారా అనే సందేహాలు మొదలయ్యాయి.



నిజానికి ప్రతిపక్షంలో ఉన్నప్పటినుండే జగన్ సోషల్ ఇంజనీరింగ్ పాటిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అదిమరింతగా పెరిగిపోయింది. సమాజంలో సగం జనాభా ఉన్న బీసీలతో పాటు  ఎస్సీ, ఎస్టీ, మైనారిటిలకు పదవుల్లో జగన్ పెద్దపీట వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటిల్లో దాదాపు నూరుశాతం జగన్ తోనే ఉన్నారు. బీసీల్లో ఇంకా కొన్ని సెక్షన్లు టీడీపీతో ఉన్నాయి. బహుశా వాటిని కూడా లాగేస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీని పూర్తిగా నేలమట్టం చేసేయచ్చని జగన్ ప్లాన్ చేస్తున్నట్లున్నారు. అందుకనే హఠాత్తుగా ఈ యాత్ర పెట్టారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: