"వర్క్ ఫ్రమ్ హోమ్" గురించి వాస్తవాలు చెప్పిన బ్రిటన్ ప్రధాని !

VAMSI
కరోనా వచ్చి మానవాళి జీవన శైలిని పూర్తిగా మార్చేసింది. వాటిలో ఒకటి వర్క్ ఫ్రం హోమ్ ముఖ్యంగా చిన్న వ్యాపార సంస్థల నుండి పెద్ద వ్యాపార సంస్థల వరకు చాలా వరకు అన్ని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ను ప్రకటించేశాయి. గత రెండేళ్లుగా ఉద్యోగస్తులు చాలా మంది ఇదే తరహాలో ఇంటి వద్ద నుండే పని చేస్తున్నారు. ఈ క్రమంలో వర్క్ ఫ్రం హోమ్ కి బాగా అలవాటు పడిపోయారు. రీసెంట్ గా జరిగిన కొన్ని సర్వేలు ప్రకారం దాదాపు 80% మంది ఉద్యోగస్తులు తిరిగి ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం చేయడం పట్ల అసంతృప్తిని తెలియచేస్తున్నారు. ఇంటి వద్ద నుండే పని చేయడానికి ఇష్టపడుతున్నారు అని తెలుస్తోంది. అదే విధంగా కరోనా తగ్గుముఖం పట్టిన క్రమంలో చిన్న చిన్న కంపెనీల నుండి ఐటి కంపెనీలు వరకు అన్ని కూడా ఉద్యోగస్తులకు తిరిగి కంపెనీలకు రప్పించడానికి నానా తంటాలు పడుతున్నాయి.
వారిని తిరిగి కార్యాలయాలకు రప్పించడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాయట. కొన్ని కంపెనీలు అయితే కొత్త కొత్త ఆఫర్ లను కూడా ప్రకటిస్తున్నాయి. అయితే మేజర్ ఉద్యోగస్తులు మాత్రం ఇంటి వద్ద నుండే పని చేయాలని కోరుకుంటున్నారట. అయితే ఇటువంటి నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్ గురించి బ్రిటన్ ప్రధాని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. వర్క్ ఫ్రమ్ హోం వలన ఉద్యోగుల దృష్టి వర్క్ పై పూర్తిగా పెట్టలేరని అలాగే... దృష్టి మరలుతుందని, ఈ విధానంతో నాకెదురైన అనుభవం ఇది అంటూ  బోరిస్ జాన్సన్ ఇలా చెప్పుకొచ్చారు. ఇంటి నుంచి పని చేసే సమయంలో మధ్యలో ఇంకో కాఫీ తెచ్చుకునేందుకు మనం ఎక్కువ సమయం కేటాయిస్తాము అని అలాగే మళ్లీ తినుబండారాలు తెచ్చుకోవడానికి అలా నడుచుకుంటూ ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి తెచ్చుకుని తినడం ప్రారంభిస్తాం అని... తిరిగి నిదానంగా నడుచుకుంటూ ల్యాప్ టాప్ వద్దకు వచ్చే సరికి  మనం చేస్తున్న పని ఎంటి అన్నది కూడా గుర్తుండదు అని, మరచిపోతామని బోరిస్ తన అనుభవాన్ని చెప్పుకొచ్చారు.
అందుకే మళ్లీ కార్యాలయాలకు వచ్చి విధులు చేయడం అన్నది అవసరం అని, అయితేనే వర్క్ పై ఏకాగ్రత పెరుగుతుందని...కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలను అందుకోవచ్చు అని.. చుట్టూ మనతోటి ఉద్యోగుల కారణంగా పోటీతత్వం పెరిగి మరింత సమర్థవంతంగా పనిచేస్తారని, చుట్టూ ఇతరులుంటే మన ఉత్సాహంతో పాటు సరికొత్త ఐడియాలతో పనిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. ఇది కాకుండా ఆఫీసులో సీటింగ్ లాగా మనకు ఇంటి వద్ద సౌకర్యవంతంగా ఉండదని  చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: