రాయలసీమ : జగన్ దెబ్బ ఇంతగట్టిగా తగిలిందా ? 5న ముహూర్తం

Vijaya



ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు జగన్మోహన్ రెడ్డి దెబ్బ బాగా గట్టిగానే తగిలినట్లుంది. నలబైఏళ్ళల్లో తనను దెబ్బకొట్టేంత సత్తావున్న వాళ్ళు ఎవరు లేరని అనుకుంటున్న సమయంలో 2019లో జగన్ గట్టిదెబ్బ కొట్టారు. దాంతో జూన్ నెల 5వ తేదీన కుప్పంలో చంద్రబాబు భూమిపూజ చేస్తున్నారు. కుప్పంలో కొత్తగా కట్టుకోబోయే ఇంటికి 5వ తేదీన భువనేశ్వరితో సహా వచ్చి శంకుస్ధాపన చేయబోతున్నారు.



ఈమధ్యనే చంద్రబాబు కుప్పంలో 2 ఎకరాలు కొన్నారు. దీనికి సంబంధించిన రాతకోతలన్నీ ఈమధ్యనే జరిగాయి. 12వ తేదీన రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్ళి అవసరమైన కాగితాలపై వేలిముద్రలు వేసి రిజిస్ట్రేషన్ వ్యవహారాలను పూర్తిచేసుకున్నారు. నిజానికి 30 ఏళ్ళుగా కుప్పానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇల్లు కట్టుకోవాలని అనిపించకపోవటమే విచిత్రం. ఎందుకంటే ఎంతకాలమైనా సొంతానికి ఒక ఇల్లంటు లేకుండానే మ్యానేజ్ చేయచ్చని అనుకునుంటారు. అందుకనే సొంతింటి గురించి ఆలోచించలేదు.



అయితే స్ధానికసంస్ధల ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవటంతో చంద్రబాబు స్ధానికత మీద చర్చ మొదలైంది. చంద్రబాబు లోకల్ కాదుకాబట్టే కుప్పంలో ఇల్లు కట్టుకోలేదనే చర్చ జనాల్లో మొదలైంది. ఇదే విషయాన్ని కుప్పం నేతలు కూడా సమీక్షలో డైరెక్టుగానే చెప్పారు. ఇప్పుడు కూడా ఇల్లు కట్టుకోకపోతే వచ్చే సాధారణ ఎన్నికల్లో తన గెలుపుపైనే చంద్రబాబులో టెన్షన్ మొదలైపోయింది. అందుకనే అర్జంటుగా కుప్పంలో సొంతిటి నిర్మాణం మొదలుపెడుతున్నారు.



అంటే 30 ఏళ్ళల్లో రాని సొంతింటి ఆలోచన ఇపుడు మొదలైందంటేనే జగన్ కొట్టిన దెబ్బ చంద్రబాబుపైన ఎంతగట్టిగా తగిలిందో అర్ధమైపోతోంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఇదే విషయాన్ని ఎల్లోమీడియా రివర్సులో ప్రచారం చేస్తోంది. కుప్పంలో సొంతిల్లు కట్టుకుంటే చూడాలని నియోజకవర్గ ప్రజల కోరికను చంద్రబాబు తొందరలో తీర్చబోతున్నారని ప్రచారం మొదలుపెట్టింది. నిజానికి చంద్రబాబుకు  సొంతిల్లు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సొంతిల్లుంటే చంద్రబాబు లోకలవుతారు లేకపోతే నాన్ లోకలవుతారు. దీని ప్రభావంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా ఆశ్చర్యంలేదు. ఆ భయంతో చంద్రబాబే సొంతిల్లు కట్టుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: