నారాయణ బెయిల్ పై అంత పట్టుదల ఎందుకు..?

Deekshitha Reddy
మాజీ మంత్రి నారాయణకు బెయిల్ రావడంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు. నారాయణ బెయిల్‌ పై పైకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిందని చె్పపారాయన. రాజకీయ కక్ష సాధింపు అంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. నిజంగానే రాజకీయ కక్ష సాధించాలనుకుంటే తాము నేరుగా.. ప్రతిపక్ష నేత చంద్రబాబునే అరెస్టు చేసేవాళ్లం కదా అని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డి. టెన్త్ క్వశ్చన్ పేపర్ మాల్ ప్రాక్టీస్‌ ఘటనలో మరికొన్ని విద్యాసంస్థల ప్రమేయం కూడా ఉందని అన్నారు సజ్జల.
ఎవ్వరినీ వదిలిపెట్టం..
పేపర్ మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను సైతం వదిలిపెట్టేది లేదని చెప్పారు సజ్జల వారిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు తేలినవారిని ప్రభుత్వం వదలిపెట్టదని, ఎంతటివారినైనా శిక్షిస్తామని చెప్పారు. చంద్రబాబు సహా ఎవరినైనా పోలీసులు ఆధారాలతోనే అరెస్ట్ చేస్తారని చెప్పారు సజ్జల. అక్రమాలపై కచ్చితమైన ఆధారాలు ఉన్నాయనుకుంటేనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
మాఫియా ముఠాలుగా మారాయి..
ఏపీలో కొన్ని విద్యాసంస్థలు ప్రభుత్వ ఉద్యోగులను వాడుకుంటున్నాయని, మాఫియా ముఠాలా మారాయని మండిపడ్డారు సజ్జల. పరీక్ష ప్రారంభం కాగానే కొంతమంది ఉపాధ్యాయులు ప్రశ్నాపత్రాలను ఫొటోలు తీసి బయటకు పంపారని, వాటి కారణంగానే పేపర్ లీకేజీ అనే ప్రచారం జరిగిందని చెప్పారు. అలాంటి ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనలో ఎవరినీ వదిలిపెట్టబోమని చెప్పారాయన.
ఇక నారాయణ బెయిల్ వ్యవహారంలో కూడా సజ్జల సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తెల్లవారు ఝామున బెయిల్ ఇచ్చారని చెప్పారు. ఈ బెయిల్ వ్యవహారంలో తాము పై కోర్టుకి వెళ్తామన్నారు. అరెస్ట్ లు రాజకీయ కక్షలు కాదని మరోసారి స్పష్టం చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: