రాయలసీమ : కుప్పం చుట్టూ ప్రదక్షిణలు దేనికోతెలుసా ?

Vijayaఓటమి భయం బాగానే పట్టుకున్నట్లుంది చంద్రబాబునాయుడులో. అందుకనే దాదాపు ప్రతి రెండునెలలకు ఒకసారి కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటనలు పెట్టుకుంటున్నారు. ఈరోజు నుండి శుక్రవారం వరకు చంద్రబాబు కుప్పంలో పర్యటించబోతున్నారు. బుధవారం మధ్యాహ్నం బెంగుళూరుకు చేరుకుని అక్కడినుండి కుప్పంకు చేరుకుంటారు. మళ్ళీ శుక్రవారం నాడు కుడా  బెంగుళూరుకు వెళ్ళి అక్కడినుండి తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు.ఇక్కడ గమనించాల్సిందేమంటే ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు కుప్పంలో పర్యటించటం చాలా అరుదనే చెప్పాలి. సీఎం హోదాలో తన నియోజకవర్గంలో ఏడాదికి ఒకసారి పర్యటిస్తే అదే చాలా ఎక్కువ. చివరకు ఎంఎల్ఏగా నామినేషన్ వేయటానికి కూడా తాను కాకుండా తన కొడుకు లోకేష్ నో లేదా నేతలు, లాయర్ల ద్వారా మాత్రమే నామినేషన్ పత్రాలను పంపేవారు. అలాంటిది గడచిన కొద్దినెలలుగా పదే పదే చంద్రబాబుకు కుప్పంలో ఎందుకు పర్యటిస్తున్నారు ?  ఇక్కడే చంద్రబాబులోని భయం బయటపడుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గంపై జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చంద్రబాబును ఓడించాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే కుప్పంకు అవసరమైనవన్నీ చేస్తున్నారు. దీని ఫలితంగానే ఈమధ్యనే జరిగిన స్ధానికసంస్ధల ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపాలిటిలో కూడా టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. 40 ఏళ్ళల్లో టీడీపీకి ఇంత ఘోరంగా ఎప్పుడూ ఓడిపోలేదు.దాంతో చంద్రబాబులో భయం పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో తాను ఓడిపోతే అంతకుమించిన అవమానం మరోటుండదు. అందుకనే కుప్పంలో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు పదే పదే నియోజకవర్గంలో తిరుగుతున్నారు. పార్టీ నేతలతో పాటు జనాలతో టచ్ లో ఉండకపోతే పుట్టిముణుగుతుందన్న భయంతోనే కుప్పం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరి ఈ ప్రదక్షిణలు చంద్రబాబును గట్టెక్కిస్తాయా ? లేకపోతే జగన్+పెద్దిరెడ్డి వ్యూహాల ప్రకారమే కుప్పం ఫలితం ఉంటందా అనేది ఆసక్తిగా మారింది. చివరికేమవుతుందో చూడాల్సిందే.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: