హైదరాబాద్ : రాహుల్ అంటే కేసీయార్ భయపడుతున్నారా ?

Vijaya



కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటే కేసీయార్ భయపడుతున్నారా ? ఇపుడిదే అంశంపై చర్చ జరుగుతోంది. మే నెల 7, 8 తేదీల్లో తెలంగాణాలో రాహుల్ టూరుంది. రెండురోజుల పర్యటనలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్ధులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించాలని రాహుల్ అనుకున్నారు. యూనివర్సిటి ఆడిటోరియలంలో జరపాలని అనుకున్న కార్యక్రమానికి అనుమతివ్వాలంటు కాంగ్రెస్ నేతలు వైస్ ఛాన్సలర్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.




అయితే రాహుల్ కార్యక్రమాన్ని అనుమతించేది లేదని యూనివర్సిటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్  ప్రకటించింది. రాజకీయ కార్యక్రమాలను యూనివర్సిటిలో అనుమతించేది లేదని యూనివర్సిటి ప్రకటించింది. దీనికి కాంగ్రెస్ నేతలు స్పందిస్తు రాహుల్ కార్యక్రమం కేవలం విద్యార్ధులను ఉద్దేశించిందే కానీ రాజకీయసభ కాదని క్లారిటి ఇచ్చారు. అయినా సరే రాహుల్ కార్యక్రమానికి అనుమతిచ్చేదిలేదని తెగేసి చెప్పింది యూనివర్సిటి యాజమాన్యం.



కాంగ్రెస్ నేతలు అనుమతి కోరగానే టీఆర్ఎస్ యువజన విభాగం వెళ్ళి అభ్యంతరం వ్యక్తంచేసింది. ఎట్టి పరిస్ధితుల్లోను రాహుల్ ను యూనివర్సిటిలోకి అనుమతివ్వకూడదని టీఆర్ఎస్ విభాగం అభ్యంతరం చెప్పటమే విచిత్రంగా ఉంది. రాహుల్ ఏ రాష్ట్రంలో పర్యటించినా యూనివర్సిటి విద్యార్ధులతో ముఖాముఖి నిర్వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది ఉస్మానియాలో కార్యక్రమాన్ని యాజమాన్యం ఎందుకు తిరస్కరించింది ? రాహుల్ కార్యక్రమానికి అనుమతిస్తే ప్రభుత్వానికి కానీ యూనివర్సిటీకి గానీ వచ్చే నష్టం ఏమిటో అర్ధం కావటంలేదు. 




ఎందుకంటే రాహుల్ కార్యక్రమంలో నిరుద్యోగులు, టీఆర్ఎస్ వ్యతిరేకవర్గాలకు చెందిన విద్యార్ధులంతా కేసీయార్ పాలనకు వ్యతిరేకంగా మాట్లాడుతారన్న భయంతోనే అధికారపార్టీ కాంగ్రెస్ రిక్వెస్టును రెజెక్ట్ చేసిందని సమాచారం. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తమ ప్రభుత్వానికి నిరుద్యోగులనుండి, విద్యార్ధి సంఘాల నుండి బాగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు కేసీయార్. అలాంటిది ప్రత్యేకంగా రాహుల్ కార్యక్రమానికి అనుమతిస్తే వ్యతిరేకత మరింతగా బయటపడుతుందనే టెన్షన్ మొదలైందట. అందుకనే కార్యక్రమానికి అనుమతివ్వలేదనే టాక్ నడుస్తోంది. ఏదేమైనా కాంగ్రెస్ ను చూసి కేసీయార్ భయపడుతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. యూనివర్సిటీదేముంది అధికారపార్టీ ఎలా చెబితే అలా నడుచుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: