కరోనా కేసులు పెరుగుతున్నాయి.. అయినా భయం అక్కర్లేదట ?

VAMSI
దేశంలో కరోనా మళ్ళీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది అంటే పరిస్థితి ఏమి అర్దం కావడం లేదు అంటూ వాపోతున్నారు జనాలు. అయితే మళ్ళీ కరోనా వ్యాప్తి వేగం పెంచిన వేల ప్రజలు కంగారు పడటం సహజమే. అయితే ఇందుకు ఆరోగ్య నిపుణులు ఏమి చెబుతున్నారు. కరోనా తీవ్రత గురించి ఏమంటున్నారు అంటే..!! ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు మళ్లీ గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. అక్కడ దగ్గర దగ్గర గత వారం రోజుల నుండి నిత్యం 1000 కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ ఉండటంతో మహమ్మారి గురించి మళ్ళీ భయం మొదలయ్యింది.
మరో వైపు అధికారులు సైతం ఈ విషయాన్ని సింపుల్ గా తీసుకోకుండా శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ కరోనా కట్టడికి ఆంక్షలు విధించేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వ్యక్తులపై రూ.500 జరిమానా అని ఆంక్షలు పెట్టారు. అదే విధంగా పబ్లిక్ ఎక్కువగా ఉండే, మార్కెట్ వంటి ప్రాంతాల్లోని వ్యాపారస్తులు అందరూ కూడా బూస్టర్ డోస్ వేయించుకోవాలని సూచించారు. అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం లోనూ అశ్రద్ద చేయరాదని హెచ్చరించారు.  అయితే ప్రముఖ వైద్యులు మాత్రం జాగ్రత్తలు అవసరమే. కానీ కరోనా వలన ఆందోళన చెందకండి అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం కరోనా బారిన పడిన వారిలో కేవలం 1 శాతం కంటే తక్కువ మంది మాత్రమే ఆసుపత్రిలో చేరుతున్న పరిస్థితులు ఉన్నాయి.

మిగిలిన వారు చిన్న చిన్న లక్షణాలతో తిరిగి కోలుకుంటున్నారు. అందుకే కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ ఢిల్లీని రెడ్‌ జోన్ గా ఇంకా ప్రకటించలేదు అని వివరిస్తూ సమాచారం అందించారు కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యుడు, ఎయిమ్స్ వైద్యుడు అయినటువంటి అజయ్ నంబియార్. మరి ఈ విషయంలో మనమంతా కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రముఖులు సూచిస్తున్నారు.  ఈసారి వ్యాప్తి చెందుతున్న కరోనా పెద్దగా ప్రభావం చూపడం లేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి కొందరు వైద్య నిపుణులు కూడా ఇదే చెబుతూ ప్రజలు ఆందోళన చెందకండి అని చెబుతున్నారు.  సర్వోదయ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్ సీనియర్ కన్సల్టెంట్,  జనరల్ ఫిజిషియన్ డాక్టర్&ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ సుమిత్ అగర్వాల్ కూడా ఈ విషయం పై మాట్లాడుతూ కరోనా పెద్దగా ప్రభావితం చేయడం లేదని...కానీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం అవసరమని  పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: