ఢిల్లీ : కాంగ్రెస్-పీకే ఇద్దరూ సేఫ్ గేమ్ ఆడారా ?

Vijayaరాజకీయ వ్యవూకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) కాంగ్రెస్ లో చేరటంలేదన్న వార్తతో కొంతమంది ఆశ్చర్యపోతే మరికొంతమంది సంతోషించారు. ఎవరి సంగతి ఎలాగున్నా తెలంగాణా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు అనేకమంది పెద్ద రిలీఫ్ ఫీలయ్యారు. కాంగ్రెస్ లో చేరటానికి పీకే ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నది వాస్తవం. అయితే చివరి నిముషంలో ఇటు కాంగ్రెస్ అటు పీకే ఇద్దరు సేఫ్ గేమ్ ఆడారు. దాంతో కేవలం వ్యూహకర్తగా మాత్రమే ఉంటాను కానీ పార్టీలో చేరకూడదని పీకే డిసైడ్ అయ్యారు.కాంగ్రెస్ కోణం నుండి ఆలోచిస్తే పీకేను వ్యూహకర్త+ పార్టీ  హోల్ టైమర్ గా చేర్చుకోవాలని అనుకున్నది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ తో పనిచేస్తు అటు అనేక పార్టీలతో పనిచేయటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నది కాంగ్రెస్ సీనియర్ల ఆలోచన. ఇందులో పార్టీ నేతలను తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. ఉదాహరణకు టీఆర్ఎస్-కాంగ్రెస్ కు తెలంగాణాలో ఉప్పునిప్పుగా ఉంది. అలాంటిది కాంగ్రెస్ పార్టీలో చేరిన పీకే తెలంగాణాలో కూడా కాంగ్రెస్ కే పనిచేయాలి గానీ  టీఆర్ఎస్ కు ఎలా పనిచేస్తారు ?సో పీకే విషయంలో కాంగ్రెస్ సరైన స్ట్రాటజీనే ప్లే చేసింది. ఇదే సమయంలో పీకే కూడా చాలా దూరమాలోచించాడు. ఎలాగంటే పీకే రాజకీయ నేతకాదు. వేల కోట్లరూపాయల వ్యాపారం చేస్తున్న బిజినెస్ మ్యాన్. తన తెలివితేటలను కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉపయోగంచే బదులు డిమాండును బట్టి దేశంలో ఇష్టమొచ్చిన వాళ్ళకు ఇష్టమొచ్చిన ధరకు అమ్ముకుంటే బాగా డబ్బులొస్తాయి.దేశంలోని చాలా పార్టీలు తన తెలివితేటలను కొనటానికి సిద్ధంగా ఉన్నపుడు ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే ఎందుకు పరిమితం  కావాలని  ఆలోచించుంటాడు. అందుకనే కాంగ్రెస్ షరతుకు పీకే అంగీకరించలేదు. సో దీనివల్ల ఇప్పుడేమైందంటే ఇటు కాంగ్రెస్ అటు పీకే ఇద్దరూ సేఫే. వ్యూహకర్తగా కాంగ్రెస్ కు సేవలందిస్తునే తనకు ఇష్టం వచ్చిన వారికి కూడా తన తెలివితేటలను అమ్ముకుంటాడు. పార్టీలో చేరటానికి పీకే నిరాకరించటానికి అసలైన కారణం ఇంతకంటే వేరే ఉండే అవకాశంలేదు.మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: