పీక కోసిన పుష్ప.. ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ ?

Chakravarthi Kalyan
సర్‌ప్రైజ్.. ఈ మధ్య రెండు రోజులుగా ఈ పుష్ప విషయం బాగా వైరల్ అవుతోంది. కాబోయే పెళ్లి కొడుకు గొంతును సాక్షాత్తూ కాబోయే వధువు కోసేయడం.. తెలుగు రాష్ట్రాల్లో సంచలన వార్తగా మారింది. పెళ్లి ఇష్టం లేని ఓ అమ్మాయి.. తన కాబోయే భర్తను బయటకు వెళ్దామని చెప్పి తీసుకెళ్లి.. సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఇస్తానంటూ ఏకాంత ప్రదేశంలోకి తీసుకెళ్లి.. అక్కడ అబ్బాయిని కళ్లు మూసుకోమని చెప్పి.. ఏకంగా కాబోయే భర్త గొంతు కోసేయడం హాట్ టాపిక్‌గా మారింది.

ఆ అమ్మాయి చేసింది రైటే అని వాదించేవారు.. కొందరైతే.. అసలు అలా చేయడం పూర్తిగా తప్పు అని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా నచ్చకపోతే.. చెప్పాలి కానీ.. ఇలా మరీ గొంతు కోస్తారా అనే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. మొత్తానికి ఆ అమ్మాయిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు. అయితే.. అసలు ఆ అమ్మాయి ఎందుకు అబ్బాయి పీక కోసింది. దీని వెనుక ఉన్న కథ ఏంటన్నదానిపై బాగా చర్చ జరుగుతోంది.

ఈ విషయంలో ఇప్పుడు మరో ట్విస్ట్ వినిపిస్తోంది. అసలు ఆ అమ్మాయికి పెళ్లి చేసుకోవడం ఎందుకు ఇష్టం లేదన్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. అందరూ అనుకున్నట్టుగా ఆ అమ్మాయికి మరో ప్రేమ వ్యవహారం ఉండటం కారణం కాదని తెలుస్తోంది. ఆమె ఎవరినో ప్రేమిస్తూ.. ఇతడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇలా చేయలేదట. మరేంటి విషయం అంటారా.. ఆమె స్థానికంగా ఉన్న ఓ ఆశ్రమానికి తరచూ వెళ్తుందట. అలా ఆ అమ్మాయికి భక్తి భావం పెరిగిపోయిందట.

ఇక జీవితమంతా అలా భక్తిలోనే గడిపేయాలని ఆ అమ్మాయి నిర్ణయించుకుంది. అందుకోసమే ఆ అమ్మాయి గతంలోనూ ఒకటి, రెండు సంబంధాలను వద్దని పంపేసిందట. కానీ.. ఆమె తల్లిదండ్రులు మరో సంబంధం చూశారు. దీంతో ఇక తప్పక ఆ అబ్బాయి గొంతు కోశానని ఆమె చెప్పిందట. అయితే.. తన భక్తి విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పిందో లేదో అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. సో.. మొత్తానికి పుష్ప భక్తి వ్యవహారం కాస్తా.. కాబోయే భర్త పీక కోతకు కారణమైందన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: