రాయలసీమ : రోజాకు సెగ తప్పదా ?

Vijaya



కొత్తగా మంత్రిగా బాద్యతలు తీసుకున్న ఫైర్ బ్రాండ్ రోజాకు సెగ తప్పేట్లులేదు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా నియోజకవర్గమైన నగిరికి సోమవారం వచ్చారు. ఆ సందర్భంగా భారీ ఊరేగింపుతో రోజాకు మద్దతుదారులు ఘనస్వాగతం పలికారు. పెద్ద ఊరేగింపుతో కాన్వాయ్ నగిరిలోని క్లాక్ టవర్ సెంటర్ కు చేరుకోగానే మద్దతుదారులు, ప్రజలను ఉద్దేశించి రోజా మాట్లాడారు.



నిజానికి ఇదంతా ఏ మంత్రయినా తొలిసారి నియోజకవర్గానికి వచ్చినపుడు జరిగేదే. కానీ ఇక్కడ ప్రత్యేకం ఏమిటంటే రోజా మాట్లడుతు తన ప్రత్యర్ధులకు తన సత్తాఏమిటో చూపిస్తానని వార్నింగ్ ఇవ్వటమే. మామూలుగా అయితే ఇలాంటి సమయంలో మంత్రులెవరు ప్రత్యర్ధులకు వార్నింగులు ఇవ్వరు. ఎందుకంటే మంత్రయిన తర్వాత తన ప్రత్యర్ధులతో సయోధ్యకు ప్రయత్నంచేస్తారు. ప్రత్యర్ధి పార్టీలతో అంటే ఎలాగూ గొడవలు తప్పవు.



అందుకనే పార్టీలోని ప్రత్యర్ధులతో అన్నా సయోధ్యకు రెడీ అవుతారు. కానీ రోజా అదేమీ ఆలోచించకుండానే తన ప్రత్యర్ధులకు తన సత్తా ఏమిటో చూపిస్తానని వార్నింగ్ ఇవ్వటమే హైలైట్ అయ్యింది. ఇక్కడ విషయం ఏమింటటే రోజాకు రెండు రకాలుగా ప్రత్యర్ధులున్నారు. మొదటిదేమో ప్రతిపక్షాల్లోని నేతలు. ఇక రెండోరకం ప్రత్యర్ధులేమో పార్టీలోనే ఉన్న ప్రత్యర్ధులు. ఇక్కడ రోజా మరచిపోయిందేమంటే ప్రతిపక్షాల్లోని ప్రత్యర్ధులకన్నా పార్టీలోని ప్రత్యర్ధులే పవర్ ఫుల్లు.



రోజాకు పార్టీలోనే బలమైన ప్రత్యర్ధివర్గముంది. వారి సహకారం లేకుండా వచ్చే ఎన్నికల్లో రోజా గెలవటం అంత ఈజీకాదు. ప్రతిచిన్న విషయానికి వీళ్ళ మధ్య గొడవలు జరుగుతునే ఉన్నాయి. విచిత్రం ఏమిటంటే ఇటు రోజా అయినా అటు ప్రత్యర్ధివర్గమైనా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులే. ఈ నేపధ్యంలోనే మొదటిసారి మంత్రి అయ్యింది కాబట్టి తన ప్రత్యర్ధులతో సయోధ్య చేసుకుంటుందని అనుకున్నారు. కానీ విచిత్రంగా ఎవరినీ ప్రస్తావించకుండానే తన ప్రత్యర్ధులకు తన సత్తా ఏమిటో చూపిస్తానని చాలెంజ్ చేశారు. అంటే పార్టీలోని వైరివర్గంతో సయోధ్య చేసుకునే ఉద్దేశ్యంలో లేరని అనుకుంటున్నారు. కాబట్టి ముందుముందు ఏమి జరుగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: