అమరావతి : వీళ్ళ ముగ్గురే కీలకమా ?

Vijaya



ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే కొత్త క్యాబినెట్ మొత్తంమీద ముగ్గురు చాలా కీలకంగా వ్యవహరించబోతున్నట్లు అనుమానంగా ఉంది. ఇంతకీ వాళ్ళెవరయ్యా అంటే మంత్రులుగా మొదటిసారి బాధ్యతలు తీసుకున్న రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాధ్. వీళ్ళముగ్గురు మంచి మాటకారులే. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవసరమైనా లేకపోయినా ప్రతి చిన్న విషయానికీ నానా రచ్చ చేస్తున్న విషయం అందరు చూస్తున్నదే.




సో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కునేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా వీళ్ళ ముగ్గురికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్ అంటే పై ముగ్గురు రెచ్చిపోతున్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి వీళ్ళంతట వీళ్ళుగా పై ముగ్గురిపై మాట్లాడేదేముండదు. కానీ ప్రభుత్వానికి సంబంధంలేని విషయాల్లో కూడా చంద్రబాబు, లోకేష్, పవన్ తో పాటు మిగిలిన ప్రతిపక్షాల నేతలు డైరెక్టుగా జగన్నే తప్పుపడుతున్నారు. రాష్ఠ్రంలో ఎక్కడేమి జరిగినా జగన్ కు ముడిపెట్టేస్తున్నారు. 



అయినదానికి కానిదానికి జగన్ను వివాదంలోకి లాగుతున్న వారికి గట్టిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే గతంలో అయితే ప్రభుత్వం పెద్దగా పట్టించుకునేదికాదు. కానీ షెడ్యూల్ ఎన్నికలు రెండేళ్ళలో ఉంది. అందుకనే గతంలోలాగ ఊరికే వదిలేస్తే జనాల్లోకి రాంగ్ సిగ్నల్ వెళ్ళే అవకాశముందని జగన్ భావించారట. అందుకనే కౌంటర్లకు రీ కౌంటర్లు ఇచ్చే బాధ్యత పై ముగ్గురు మంత్రులకు అప్పగించారట.



కౌంటర్లు, రీ కౌంటర్లు ఇవ్వటంలో పై ముగ్గురిలో ఎవరి స్టైల్ వారిదే. ముగ్గరు కూడా ప్రత్యర్ధులపై తమదైన పంచులతో విరుచుకుపడుతుంటారు. ఇందులో అంబటి, రోజాది ప్రత్యేక శైలి. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ , పవన్ లాంటి వాళ్ళు వీళ్ళ పంచులను రుచిచూసున్నారు. అంటే పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాబోయే రెండేళ్ళు పై ముగ్గురు మంత్రులకు ఇటు శాఖల బాధ్యతలతో పాటు అటు ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉందని అర్ధమైపోతోంది. మరి వీళ్ళికిచ్చిన బాధ్యతల్లో మంత్రులు ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: