జగన్ చేతిని ముద్దాడిన మంత్రి ఆర్కే రోజా?

VAMSI
ఇన్నాళ్లకు రోజ  కల నిజం అయ్యింది అని చెప్పుకోవచ్చు.  ఎప్పటి నుండో పాలిటిక్స్ లో కీలకంగా వ్యవహరిస్తున్న ఈమె    ఇప్పటి వరకు ఎంఎల్ఏ గా మాత్రమే తన సేవలను అందించారు. అయితే నాయకురాలు రోజా మంత్రిగా అవ్వాలని అనుకుంటున్నారు అని అందుకు ముహూర్తం కూడా సిద్దం అయ్యిందని పలుమార్లు  వినిపించాయి. అయితే ఇన్నాళ్లకు ఆమే  పడ్డ శ్రమకి తగ్గ ఫలితం దక్కింది. తొలిసారి మంత్రిగా ఆమె ప్రమాణస్వీకారం చేశారు. తదనంతరం సభలో సిఎం జగన్ దగ్గరకు వచ్చి ఆయన కళ్ళకు నమస్కరించుకుని ఆశీర్వాదం అందుకున్నారు. 

అంతేకాదు ఈ సంతోషకరమైన సమయం లో  అభిమానం తో జగన్ చేతిని ఆప్యాయంగా ముద్దాడారు రోజా. 2004 లో టిడిపి తరపున పోటీ చేసి ఓటమి పాలు అయ్యి ఎన్నో అవమానాలకు గురి అయ్యారు. కానీ మళ్ళీ 2014 లో వైసిపి పార్టీ లో చేరి విజయాన్ని అందుకున్నారు...అప్పటి నుండి నిరంకుశంగా ప్రజలకోసం పనిచేస్తూ జనాల అభిమానాన్ని అందుకున్నారు. సినీ రంగం లో నుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఈమె అటు నటిగా ఇటు నాయకురాలిగా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు.   పాలిటిక్స్ లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన ఈమెకు మరెవరూ సరిలేరు. ఇక మంత్రి పదవిని అందుకున్న ఈమె ఇకపై సినిమాలు,టీవి షోలలో కనిపించను అని  అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.


ఇప్పటి వరకు ఒకెత్తు అయితే ఇకపై మంత్రిగా నాయకురాలు రోజాపై చాలా బాధ్యతలు ఉండనున్నాయి...
మంత్రిగా బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తిస్తూ ప్రజల సేవకు తన పూర్తి సమయాన్ని కేటాయించాలనే ఉద్దేశంతోనే ఇలా చేశారని చెబుతున్నారు. ఏదేమైనా ఆమె ఇకపై తెరపై  పెద్దగా కనిపించరు అన్న మాట అంYour browser does not support HTML5 video.దరినీ ఎంతగానో బాదిస్తోంది. కానీ ఒక నాయకురాలిగా ఆమె ఎప్పుడు మన వెంటే ఉండి మందికి నడిపిస్తాను అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: